హనుమాన్ చిత్రంతో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న టేజా సజ్జా, ఇప్పుడు, మరో భారీ విజువల్ వండర్, మిరాయ్ లో సూపర్ వారియర్‌గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు.
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. కాగా, ఈ సినిమా చుట్టూ ఇప్పటికే ఉన్న హైప్‌కు, తేజా సజ్జా పుట్టినరోజు సందర్భంగా విడుదలైన మాస్ పోస్టర్ & BTS వీడియో మరింత ఊపు తెచ్చాయి.
ఆ BTS (బిహైండ్ ది సీన్స్) వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ వీడియోలో తేజా సజ్జా గ్రావిటీని సవాల్ చేస్తూ, ఉత్కంఠభరితమైన స్టంట్స్ చేస్తూ కనిపించడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ సినిమాలో తేజ శక్తివంతమైన సూపర్ యోధుడుగా దర్శనమివ్వనున్నారు. దీంతో అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.
ఈ సినిమాలో రీతికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తుండగా, రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ప్రధాన ప్రతినాయకుడిగా పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. హరి గౌర సంగీతం సమకూరుస్తున్నారు.
ప్రతిష్టాత్మకంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న మిరాయి, 8 భాషల్లో 2D, 3D ఫార్మాట్లలో పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రేక్షకులకు ఒక అద్భుతమైన విజువల్ ఫీస్ట్ అందించబోతోంది