తిమ్మారెడ్డిపల్లి తండాలో మంత్రి వాకిటి శ్రీహరి పర్యటన

తిమ్మారెడ్డిపల్లి తండాలో మంత్రి వాకిటి శ్రీహరి పర్యటన
ఊట్కూర్, ఆంధ్రప్రభః నారాయణపేట జిల్లాఊట్కూర్ మండల పరిధిలోని తిమ్మారెడ్డి పల్లి తండాల్లో సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలకు రాష్ట్ర పాడి పరిశ్రమల మత్స్య క్రీడలు యువజన శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి హాజరుకానున్నట్లు ఊట్కూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు డి. యగ్నేశ్వర్ రెడ్డి, తిమ్మారెడ్డిపల్లి తండా సర్పంచ్ మోహన్ నాయక్ పేర్కొన్నారు. సేవాలాల్ 287 వ జయంతి ఉత్సవాలకు హాజరుకానున్న నేపథ్యంలో మాజీ ఎంపీపీలు జడ్పిటిసిలుమండల కాంగ్రెస్ నాయకులు సర్పంచ్ లు మాజీ సర్పంచ్ లు ఎంపీటీసీలు యువజన కాంగ్రెస్ నాయకులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.
