Koneru – మంత్రి వాకిటి ఆదేశం..
మక్తల్, ఆంధ్రప్రభ – వచ్చేనెల డిసెంబర్ 04 నుండి ప్రారంభం కానున్న శ్రీ పడమటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాల సమయానికి పుష్కరిణీ (కోనేరు)ను భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి (Vakiti Srihari) అన్నారు. బుధవారం కోనేరు పునరుద్ధరణ పనులను మంత్రి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోనేరు (Koneru) పనులను వేగవంతం చేయాలన్నారు. పనులు చక చక సాగుతున్నాయని మరింత వేగం పెంచి పూర్తి చేయాలని సూచించారు. దశాబ్దాలుగా పాడుబడి చెత్తా చెదారంతో నిండిపోయిన కోనేరు పునరుద్ధరణ స్వామి వారి సంకల్పంతో జరుగుతుందన్నారు. పనులను మరింత వేగవంతం చేసి బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు పుష్కరిణిలో స్నానాలు చేసి స్వామివారిని దర్శించే విధంగా అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
దేవాదాశాఖ అధికారులు దగ్గరుండి పనులను మరింత వేగవంతం చేయించాల్సిందిగా మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వంశపార్యం పర్య ధర్మకర్త పి. ప్రాణేశాచారి, కాంగ్రెస్ నాయకులు కట్టా సురేష్ కుమార్ గుప్తా, కావాలి తాయప్ప, పూజా శివశంకర్, హేమ సుందర్ తదితరులు ఉన్నారు.

