Minister | సేవకురాలిగాపనిచేసిప్రజలరుణం తీర్చుకుంటా.

Minister | సేవకురాలిగాపనిచేసిప్రజలరుణం తీర్చుకుంటా.

Minister | ఊట్కూర్, ఆంధ్రప్రభ : పాలకురాలిగా కాకుండా సేవకురాలిగా పనిచేసి ప్రజల రుణం తీర్చుకుంటానని ఊట్కూర్ పట్టణ కాంగ్రెస్ 14 అవార్డు సభ్యురాలు సందపురంసువర్ణ రవికుమార్ అన్నారు. ఈ రోజు నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో తుది విడత ఎన్నికల్లో(election) తనను గెలిపించిన ఓటర్లను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు తనపై ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించాలని మంత్రి డాక్టర్ వాకిడి శ్రీహరి(Minister Dr. Vakidi Srihari) సహకారంతో ప్రత్యేక నిధులు తీసుకువచ్చి వార్డుల్లో నెలకొన్న వివిధ సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు. వార్డులో ప్రజా సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ పాలకవర్గం తో పాతపేట వార్డు అభివృద్ధి(Development)కి కృషి చేస్తాననిఅన్నారు.

గత కొన్నేళ్లుగా పాలకుల నిర్లక్ష్యం కారణంగా వార్డు అభివృద్ధికి నోచుకోలేదని సిసి రోడ్లు డ్రైనేజీలు మౌలిక సదుపాయాలు కల్పించేందుకుకృషి చేస్తాననిఅన్నారు. వార్డు సభ్యురాలుగా తనను గెలిపించిన ఓటర్లకు రుణపడి ఉండి ఐదేళ్లు సేవకురాలిగా పనిచేసి ఆదర్శ వార్డుగా తీర్చిదియడమే తన లక్ష్యమనిఅన్నారు. ఈ కార్యక్రమంలో రవికుమార్ శ్రీనివాస్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply