Chennur | మంత్రి వివేక్ మార్నింగ్ వాక్

Chennur | మంత్రి వివేక్ మార్నింగ్ వాక్
సమస్యలపై ఆరా
Chennur | చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూర్ (Chennur) నియోజకవర్గ కేంద్రంలో రాష్ట్ర ఉపాధి, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి (Vivek Venkataswamy) ఉదయం స్థానిక నాయకులతో కలిసి మార్నింగ్ వాక్ (morning walk) చేశారు. పలు వార్డుల్లో నెలకొన్న సమస్యలపై కాలనీవాసులను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలు సంబంధిత అధికారులు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అనంతరం క్యాంప్ కార్యాలయంలో స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమావేశమై.. మరికొద్ది రోజుల్లో జరుగనున్న స్థానిక ఎన్నికల నిర్వహణపై చర్చించారు.
