Minister Vakiti Srihari | తనకు ఎలాంటి సంబంధం లేదు..

Minister Vakiti Srihari | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : ఇటీవలే మక్తల్‌లో బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. తనపై చేస్తున్న ఆరోపణలు రుజువైతే దేనికైనా సిద్ధమని మంత్రి అన్నారు. మహదేవప్పకు తాను ఎప్పుడూ కాల్‌ చేయలేదని.. అవసరమైతే కాల్‌ డేటా పరిశీలించాలన్నారు. పోస్ట్‌మార్టం నివేదిక తర్వాతే అసలు కారణాలు వెల్లడవుతాయి. ఎన్నికల భయంతో ఆయన మృతి చెందినట్లు కుటుంబసభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకెళ్తుందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.

Leave a Reply