ఆస్ బయోటెక్ కాన్ఫరెన్స్ కు మంత్రి శ్రీధర్ బాబు
మంథని, ఆంధ్రప్రభ : ఆస్ట్రేలియా బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్(Australia Biotech International Conference) – 2025 లో పాల్గొనడానికి తెలంగాణ ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ వెళ్లారు. ఈ రోజు ఆస్ట్రేలియాకు వెళ్లారు.
అక్కడ మెల్ బోర్న్ ఎయిర్ పోర్టులో మోనాష్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ అపర్ణ మోహన్ యేలిశెట్టి(Dr. Aparna Mohan Yelishetti,), అఖిల్ రెడ్డి పెండ్రి, మేడగోని హరి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా చెందిన విద్యార్థులు, తెలుగు సంఘం ప్రతినిధులు మంత్రి శ్రీధర్ బాబుకు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రం బయోటెక్ రంగం(Biotech sector)లో సాధిస్తున్న అభివృద్ధి పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు.