Minister | రూ.4లక్షల ఎల్ఓసీ అందజేత …
Minister | మక్తల్, ఆంధ్రప్రభ : మక్తల్ పట్టణానికి చెందిన నరేష్ అనారోగ్యంతో బాధపడుతూ శస్త్ర చికిత్సకు వైద్య సహాయం కోసం పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్య, క్రీడా యువజన సర్వీసుల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి(Minister Dr. Vakiti Srihari)ని సంప్రదించగా, వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ.4 లక్షల ప్రపోజల్ ఎల్ఓసి కాపీ మంజూరు చేశారు.
సంబంధిత ప్రపోజల్ ఎల్ఓసి(proposed LoC) ని మంత్రి ఇవాళ మక్తల్ పట్టణంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. మంచి వైద్యం అందించి, బాధితుడు త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా మంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కట్ట సురేష్ కుమార్ గుప్తా, కోళ్ళ వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

