AP | అరకపట్టి పొలం దున్ని ఏరువాక‌కు మంత్రి నిమ్మ‌ల శ్రీకారం

కర్నూలు బ్యూరో, జూన్ 11, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా, తడకనపల్లె ((Tadakanapalle) గ్రామంలో ఏరువాక కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొని పొలం దున్ని, ఉల్లి విత్తనాలు చల్లారు. ఈ కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితరెడ్డి, కలెక్టర్ రంజిత్ భాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) మాట్లాడుతూ… గత వైసీపీ ప్రభుత్వంలో వ్యవసాయంను మూతవేశారన్నారు. రైతు భరోసా కేంద్రాలను భక్షక కేంద్రాలుగా మార్చారన్నారు.

రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ గానీ చెల్లించలేదన్నారు. రాయలసీమలో నాడు చంద్రబాబు (Chandrababu) డ్రిప్ తీసుకువస్తే, గత ప్రభుత్వంలో డ్రిప్ కి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్ (Irrigation project) లకు అత్యవసర పనులకు కనీసం నిధులు ఇవ్వలేదని తెలిపారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్లే గుండ్లకమ్మ, అన్నమయ్య డ్యామ్ లు కొట్టుకుపోయినట్లు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం రైతు పక్ష పాత ప్రభుత్వమ‌న్నారు. రైతులు సుభిక్షంగా ఉండాలంటూ, రైతులందరికీ మంత్రి నిమ్మ‌ల‌ ఏరువాక శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply