మౌలానా ఆజాద్ కు లోకేష్ నివాళి..

మౌలానా ఆజాద్ కు లోకేష్ నివాళి..
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : స్వాతంత్ర్య సమరయోధులు, దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఆ మహనీయుని స్మృతికి ఘననివాళులు అర్పించారు. వినూత్న సంస్కరణల ద్వారా దేశంలో విద్యాభివృద్ధికి విశేషంగా కృషి చేసిన ఆయన సేవలు ఎనలేనివని కొనియాడారు.
భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ (Maulana Abul Kalam Azad) జయంతిని పురస్కరించుకుని జరుపుకుంటున్న మైనార్టీ సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.
