పెనమలూరు ఆంధ్ర ప్రభ :-తన ఉద్యోగం ఏదో తాను చేసుకుంటూ వేలాది రూపాయల జీతం తీసుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల బాధను గమనించి వారికి చేదోడుగా నిలిచిన ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ ను స్వయంగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) అభినందనలు తెలిపిన సంఘటన ఇది.
కృష్ణా(Krishna) జిల్లా పెనమలూరు(Penamalur) నియోజకవర్గం పోరంకిలో ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ వెంకటరత్నం(Venkataratnam) ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు మండుటెండలో నడుచుకుంటూ వెళ్లడానికి గమనించారు. చెల్లించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంటనే పిల్లలను చెప్పుల దుకాణానికి తీసుకుని వెళ్లి సొంత డబ్బులతో వారందరికీ చెప్పులు కొనివ్వడం జిల్లా వ్యాప్తంగా సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది.
లోకేష్ అభినందనలు పోస్ట్ :-
‘పిల్లలను చెప్పుల దుకాణానికి తీసుకెళ్లి చెప్పులు కొనిచ్చారు. వారు వెళ్తూ బహుమతిగా విసిరిన చిరునవ్వుతో హెడ్ కానిస్టేబుల్ ముఖంలో వెల్లివిరిసిన సంతృప్తి ఎంత గొప్పది! మీకు సెల్యూట్ వెంకటరత్నం గారు’ అని మంత్రి వీడియోను పోస్ట్ చేశారు.
పెనమలూరు ఎమ్మెల్యే సత్కారం :-
ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ వెంకటరత్నం చేసిన సేవా కార్యక్రమాన్ని సోషల్ మీడియా(Social media) ద్వారా వీక్షించిన పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్(MLA Bode Prasad) ఆదివారం రాత్రి దుశాలవా, పూలమాలతో ఘనంగా సత్కరించి ఆయన సేవానిరతిని కొనియాడారు. ఉద్యోగ బాధ్యతలతో పాటు సమాజ సేవా కార్యక్రమాలలో పాల్గొని ఇలాంటి వారిని ప్రతి ఒక్కరు అభినందించాలని తెలిపారు.

