TG | రంగరాజన్‌ను పరామర్శించిన మంత్రి కొండా సురేఖ

  • రాముడి పేరుతో హింస విచార‌క‌రం..
  • దోషులను కఠినంగా శిక్షిస్తాం
  • శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవు..

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌ను.. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పరామర్శించారు. రంగరాజన్‌పై జరిగిన దాడిపై ఆమె ఆరా తీశారు. తెలంగాణ ప్రభుత్వం తరపున అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రంగరాజన్‌పై జరిగిన దాడి గురించి ఆమె ఆరా తీశారు. తెలంగాణ ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఉండ‌గా ఉంటామని ఆయనకు భరోసా ఇచ్చారు.

రంగరాజన్‌పై జరిగిన దాడిని మంత్రి సురేఖ తీవ్రంగా ఖండించారు. ఎంతో ప్రాచీనమైన హిందూ ధర్మంలో ఎవరి నమ్మకాలు వారివని, తమ నమ్మకాలను ఇతరులపై రుద్దడం వారి స్వేచ్ఛను హరించడమేనని మంత్రి అన్నారు. దాడికి పాల్ప‌డిన‌ నిందితులు ఎంతటివారైనా కఠినంగా శిక్షిస్తామని తెలిపారు

త‌న జీవితాంతం ధర్మానికి కట్టుబడి జీవించిన రాముడి పేరుతో హింసకు పాల్పడడం బాధాకరమన్నారు. సంఘవ్యతిరేక శక్తులు తమ ప్రయోజనాల కోసం రాముడి పేరుతో రాజకీయాలు చేస్తున్నాయని, శాంతియుతంగా ఉన్న తెలంగాణ సమాజానికి భంగం కలిగించే చర్యలను ఉక్కుపాదంతో అణచివేస్తామని తేల్చి చెప్పారు. కాగా పూజారిపై దాడికి పాల్పడిన ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *