Minister kollu  కల్తీ మద్యంతో దోచేశారు AndhraPrabha assembly news

Minister kollu  కల్తీ మద్యంతో దోచేశారు AndhraPrabha assembly news

సొంతబ్రాండ్లు తెచ్చారు

ఈ స్కామ్​ ₹3000 కోట్లు పైనే

ఈ ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది

అసెంబ్లీలో మంత్రి కొల్లు రవీంద్ర

( -ఆంధ్రప్రభ, వెలగపూడి ప్రతినిధి)

 జేబులు నింపుకోవడం కోసం కల్తీ మద్యాన్ని ప్రజల నెత్తిన రుద్దారు. – మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చి కల్తీ మద్యంతో వేల కోట్లు దోచుకున్నారు. – నాణ్యమైన బ్రాండ్లు నిషేధించడంతో  NDPL అక్రమ రవాణా పెరిగింది. – గత ఐదు సంవత్సరాలలో మద్యం అక్రమ రవాణాకు సంబంధించి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్​  ప్రశ్నకు అసెంబ్లీలో మంత్రి కొల్లు రవీంద్ర ( Minister kollu)  సమాధానమిచ్చారు.

Minister kollu  :  కల్తీ మద్యం కింగ్​ పిన్​ వెనక.. ఎవరు?

Minister kollu

దేశంలో ఏ ప్రభుత్వమూ చేయని, ఏ పాలకుడు ఆలోచించలేని దుర్మార్గమైన ఆలోచనతో ప్రజల నెత్తిన కల్తీ మద్యం రుద్ది, జేబులు నింపుకున్న నాయకుడు జగన్ రెడ్డి అని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. 2019..-24 మధ్య కాలంలో ఇతర రాష్ట్రాల నుండి మద్యం అక్రమంగా రవాణా, వాహనాల స్వాధీనం గురించి మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. కల్తీ మద్యం వ్యవహారంలో  కింగ్ పిన్  వెనకున్న కింగ్ ఎవరో బయట పెట్టాలని ఎమ్మెల్యే సూచించారు.

Minister kollu

అదే సమయంలో మద్యం తయారీ కంపెనీల నుండి కమిషన్ల రూపంలో మద్యం కేసుపై రూ.250, బీరు కేసుపై రూ.150 తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. నాసిరకమైన మద్యం కారణంగా పొరుగు రాష్ట్రాల నుండి మద్యం అక్రమ రవాణా జరిగిందని, ఆ సమయంలో వేలాది వాహనాలు సీజ్ చేశారన్నారు. ప్రభుత్వం చేసిన తప్పిదానికి అమాయక ప్రజలకు చెందిన వాహనాలు సీజ్ చేయబడ్డాయి. ప్రధానంగా ఆటో లాంటి వాహనాలను విడుదల చేసి వారి జీవనోపాధి కాపాడాలని సూచించారు.

Minister kollu  : సొంత బ్రాండ్లతో దోచేశారు

Minister kollu

మంత్రి కొల్లు రవీంద్ర సమాధానమిస్తూ.. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న అడ్డగోలు నిర్ణయాలతో మద్యం వ్యాపారం మొత్తాన్ని హస్తగతం చేసుకున్నారు. సంపూర్ణ మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చి.. దశల వారీ మద్య నిషేధం అన్నారు. ధరలు పెంచితే వినియోగం తగ్గుతుంది అనే వింత వాదన తీసుకొచ్చి అడ్డగోలుగా ధరలు పెంచారు. తర్వాత మద్యం వ్యాపారంతో సంబంధం లేని వ్యక్తుల్ని వ్యాపారంలోకి తీసుకొచ్చారు. అప్పటి వరకు ఉన్న బ్రాండ్లను తరిమేసి సొంత బ్రాండ్లను తీసుకొచ్చి, వాటినే అమ్మేలా ప్రభుత్వ ఆధ్వర్యంలో షాపులు ఏర్పాటు చేశారు.

Minister kollu :  జనం రోగగ్రస్తులయ్యారు

Minister kollu

నాణ్యమైన మద్యం అందుబాటులో లేకపోవడం, ధరలు భారీగా పెరగడంతో పొరుగు రాష్ట్రాల నుండి మద్యం అక్రమ రవాణా పెరిగింది. మరోవైపు నాటు సారా తయారీ కూడా పెరిగింది. ఫలితంగా జంగారెడ్డి గూడెంలో 22 మంది యువకులు బలైపోయారు. లక్షలాది మంది కిడ్నీ, లివర్ వ్యాధులతో ఇప్పటికీ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. గత ఐదు సంవత్సరాల్లో సుమారు రూ.3500 కోట్లకు పైగా మద్యం కుంభకోణం జరిగిందని, ఆ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ సందర్భంగా సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది. గత ఐదు సంవత్సరాల్లో జరిగిన మద్యం కుంభకోణం మొత్తాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే శ్వేతపత్రం రూపంలో విడుదల చేశాం. ప్రభుత్వ షాపుల పేరుతో ఖజానాకు చేసిన నష్టాన్ని స్పష్టంగా పేర్కొన్నాం. 

Minister kollu : అప్రమత్తంగా ఉన్నాం

 కూటమి అధికారంలోకి వచ్చాక నూతన మద్యం పాలసీ ప్రకటించాం. నాణ్యమైన మద్యం అందుబాటులో ఉంచడంతో పాటుగా, పాత బ్రాండ్లను పునరుద్దరించాం. పైగా ప్రతి మద్యం బాటిల్‌ను 13 రకాలుగా పరీక్షిస్తున్నాం. డిస్టిలరీల నుండి షాపుల్లోకి వచ్చే ప్రతి బాటిల్ ట్రాక్ అండ్ ట్రేస్ విధానంతో ట్రాక్ చేస్తున్నాం. ధరలను కూడా పొరుగు రాష్ట్రాలతో సమానంగా చేశాం. ఫలితంగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అక్రమ రవాణా తగ్గడంతో పాటు.. పొరుగు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల్లో మద్యం అమ్మకాలు పెరిగాయి. నవోదయం 2.0 కార్యక్రమంతో నాటు సారాను పూర్తిగా నిర్మూలించాం.

 Minister kollu  : మాజీ మంత్రులదే ప్రధాన  పాత్ర

Minister kollu

 కూటమి ప్రభుత్వంలో అమలవుతున్న మద్యంపై ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ములకలచెరువు, ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం తయారు చేసి ప్రభుత్వంపై నిందలేసేందుకు ప్రయత్నించారు. ఈ కేసుల్లో ఏకంగా గతంలో మంత్రులుగా పని చేసిన వారే ప్రత్యక్ష పాత్ర పోషించడం సిగ్గుచేటు. 2019 జూన్ 1 నుండి 2024 జూన్ 30 మధ్య కాలంలో 29 కల్తీ మద్యం కేసులు నమోదు చేయగా, 191 మందిని అరెస్టు చేసి 9055 లీటర్ల కల్తీ మద్యం, 2465 లీటర్ల స్పిరిట్, 34 వాహనాలు సీజ్ చేశారు. 31,057 నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం కేసులు నోముదు చేసి 5,81,963 లీటర్ల మద్యం, 10,239 వాహనాలను సీజ్ చేశాం. 2019 జూన్ 1 నుండి 2026 జనవరి వరకు 26,846 వాహనాలు స్వాధీనం చేసుకోగా అందులో 4358 వాహనాలను విడుదల చేశాం. 18,047 వాహనాలు వేలం వేశాం. ఇంకా 4441 వాహనాలను త్వరలో విడుదల చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర సమాధానమిచ్చారు.

ALSO RED : YCP   PATCHY    :   ప్చ్​.. హోదా పేచీ Andhra Prabha Insight Story

Leave a Reply