- విద్యార్థులతో నిద్ర.. అల్పాహారం చేసిన మంత్రి
ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో : వరద ప్రాంతాల పరిశీలనకు నిన్న వచ్చిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupalli Krishna Rao) ఆకస్మికంగా గిరిజన విద్యార్థులతో కలిసి హాస్టల్లో నిద్రించాలని తలుపు తట్టింది. తక్షణమే షెడ్యూల్ మార్చుకొని కొమరం భీం జిల్లా (Komaram Bheem District) జైనూరు మండలం మార్లవాయి చారిత్రక గిరిజన గూడెం కు వెళ్లారు. అక్కడే హాస్టల్ లో పిల్లలతో కలిసి అక్కడే నిద్రించడంతో అధికార యంత్రాంగంలో అలజడి రేపింది. బుధవారం ఉదయమే నిద్రలేచిన మంత్రి అక్కడే కాలకృత్యాలు తీర్చుకొని హాస్టల్ పిల్లలతో ముచ్చటిస్తూ, సమస్యలపై ఆరాతీస్తూ గిరిజన హాస్టల్ లోనే కలెక్టర్ వెంకటేష్ దుత్రే, ఎమ్మెల్యే వెడమ బోజ్జు (MLA Vedma Bhojju), మాజీ మంత్రి ఐక్యరెడ్డితో కలిసి అల్పాహారం చేశారు.
చారిత్రక నేపథ్యం ఉన్న గ్రామం మార్లవాయి..
మార్లవాయి గ్రామానికి చారిత్రక నేపథ్యం ఉంది. ఆ గ్రామంలో బస చేసిన ఆయన బుధవారం ఉదయం గిరిజనులతో మమేకమై ఇక్కడే కాలం చేసిన మానవ పరిణామ శాస్త్రవేత్త (Scientist) హైమన్ డార్ఫ్ సమాధి వద్ద మంత్రి నివాళులర్పించారు. ఆస్ట్రేలియా నుండి ఈ జిల్లాలో గిరిజనుల స్థితిగతులపై పరిశోధనలు చేసిన హైమన్ డార్ఫ్ సేవలను మంత్రి స్మరించుకున్నారు. తమ ప్రభుత్వం హాస్టల్ విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తూ 40శాతం డైట్ చార్జీలు (Diet charges) పెంచి పోషక విలువలతో కూడిన భోజనం అందిస్తున్నామని మంత్రి జూపల్లి అన్నారు.

సంక్షేమ హాస్టళ్లలో సంస్కరణలు తీసుకొచ్చాం…
సంక్షేమస్తు గృహాల్లో సంస్కరణలతో తీర్చిదిద్దింది తమ ప్రభుత్వమేనని మంత్రి జూపల్లి చెప్పుకొచ్చారు. అనంతరం కెరమెరి మండలం (Kerameri Mandal) రాజురా వద్ద వరద తాకిడికి కోతకు గురైన రోడ్డును పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. పంట ముంపు బాధితుల సమస్యలపై ఆరా తీశారు. ఆయన వెంట ఎస్పీ కాంతిలాల్ సుభాష్, మంత్రి వెంట మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఎంపీడీవో సుధాకర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
