ప్రచారంలో దూసుకెళ్తున్న మంత్రి జూపల్లి
జోరుగా జూపల్లి ప్రచారం
జూబ్లీహిల్స్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయం దగ్గర పడటంతో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupalli Krishna Rao) జోరు పెంచారు. బస్తీలు, కాలనీలు, గేటేడ్ కమ్యూనిటీల్లో తిరుగుతూ.. ఆరు గ్యారంటీలను వివరిస్తూ ఓటర్లను ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి మంత్రి జూపల్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు. పలు కాలనీలు, బస్తీల్లో మంత్రి జూపల్లికి ప్రజలు స్వాగతం పలుకుతున్నారు.
గత బీఆర్ఎస్ పాలనలో చేసిన అరాచకాలను ప్రజలకు తెలియజేస్తున్నారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన బీఆర్ఎస్ పార్టీకి మరోసారి ఓటుతో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిస్తే.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్నారు. సుల్తాన్ నగర్ లోని కల్పతరు రెసిడెన్షీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కల్పతరు నివాసితులను కలిసి.. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలని కోరారు. స్సోర్ట్స్ లాంజ్ కు వెళ్లి జిమ్ లో వ్యాయమం చేశారు. వారితో కలిసి షటిల్ ఆడారు.

అనంతరం ఎర్రగడ్డ డివిజన్ లో రాజీవ్ నగర్ కాలనీ, జయంతి నగర్, కళ్యాణ్ నగర్ వెంచర్ -3 లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ.. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపిస్తే అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామని ప్రకటించారు. మంత్రి జూపల్లి వెంట డైరీ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు.

