సంగారెడ్డి : సింగూరు డ్యామ్ (Singur Dam) నుంచి మంత్రి దామోదర రాజనర్సింహ (Damodar Rajanarsimha) నీటిని విడుదల చేశారు. సింగూరు ఎడమ కాలువ నుంచి సాగు కోసం 100 క్యూసెక్కుల నీటిని మంత్రి విడుదల చేశారు. రెండు పంటల క్రాప్ హాలిడే (Crop Holiday) తర్వాత నీటిని విడుదల చేశారు. సింగూరు ఎడమ కాలువ మరమ్మతుల నేపథ్యంలో రెండు పంటలకు అధికారులు క్రాప్ హాలిడే ప్రకటించారు. రైతులు పంట సాగుకు ఇబ్బందుల దృష్ట్యా మంత్రి దామోదర్ రాజనర్సింహ నీటిని విడుదల చేశారు.
Sangareddy | సింగూరు డ్యామ్ నుంచి నీటిని విడుదల చేసిన మంత్రి దామోదర

