Minister | పంచాయతీల అభివృద్ధికి బీజేపీ దిక్సూచి

Minister | పంచాయతీల అభివృద్ధికి బీజేపీ దిక్సూచి

Minister | తంగళ్ళపల్లి, ఆంధ్రప్రభ : గ్రామ పంచాయతీల అభివృద్ధికి బీజేపీనే దిక్సూచని, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Minister Bandi Sanjay Kumar) ప్రత్యేక చొరవతోనే నిధులు వచ్చాయని బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో పార్టీ మండల అధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్ రావు ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వ‌హించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా గోపి హాజరయ్యారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ఏర్పడిన తర్వాత రెండేళ్లుగా నిలిచిపోయిన గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఎట్టకేలకు మోక్షం లభించిందన్నారు. గత పాలనలో గ్రామ పంచాయతీలు దుర్భర స్థితికి చేరాయని, ఈ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధి దిశగా ఓటు వేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి ‘నిధులు లేవు, అప్పులే మిగిలాయి’ అని చెప్పడాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు.

గత పదేళ్ల పాలన పూర్తిగా అవినీతిమయమైందని విమర్శించిన ఆయన, స్థానిక ఎమ్మెల్యే రెండు సంవత్సరాలుగా నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదని విమ‌ర్శించారు. అయితే కేంద్ర ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకు నిరంతరం నిధులు అందుతున్నాయని తెలిపారు.

తంగళ్ళపల్లి మండలానికి రూ.1.75 కోట్ల(Rs.1.75 crore) ఎన్ఆర్ఈజీఎస్ నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ప్రత్యేక చొరవతో ఎంపీ నిధుల నుంచి 15 బోర్లు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి రూ.30 ల‌క్ష‌ల‌ నుంచి 40 లక్షల వరకు అభివృద్ధి పనులు మంజూరైనట్లు జిల్లా అధ్యక్షుడు తెలిపారు.

అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సీఆర్‌ఎస్ నిధుల ద్వారా అంబులెన్సులు, వైద్య పరికరాలు అందించడంతో పాటు 20 వేల మంది(20 thousand people) పదో తరగతి విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసి వారి ఫీజుల భారం కూడా కేంద్ర ప్రభుత్వమే తీసుకుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని పనిచేస్తోందని స్పష్టం చేశారు.

గ్రామ సర్పంచులుగా నిధులు తెచ్చే దమ్మున్న‌ నాయకులను ఎన్నుకోవాలని ప్రజలకు కోరారు. బీజేపీ దమ్మున్న నాయకత్వంలో ముందుకు సాగుతోందని, పార్టీ బలపరిచిన అభ్యర్థులనే సర్పంచులుగా గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే(vote for the party) నిధులు లేవని వాళ్లే ఒప్పుకున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply