భయం వద్దు

అండగా ఉంటాం

కూటమి ప్రభుత్వం రైతు పక్షం

ప్రభుత్వమే కనీస మద్దతు ధర ఇస్తోంది

క్కింటాలుకు రూ.1200లు చెల్లిస్తోంది

వారంలో ​ డబ్బులు జమ గ్యారంటీ

ఉల్లి రైతులకు మంత్రి భరత్​ భరోసా

 ( కర్నూలు బ్యూరో,  ఆంధ్రప్రభ )  కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతులకు అండగా ఉంటుందని ఉల్లి రైతులతో  రాష్ట్ర పరిశ్రమలు,వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టి.జి.భరత్ అన్నారు. సోమవారం ఉదయం కర్నూలు మార్కెట్ యార్డ్ లోకి తీసుకువచ్చిన ఉల్లి  దిగుబడులను పరిశీలించి మంత్రి భరత్ రైతులతో ​  మాట్లాడారు. ఓర్వకల్లు మండలం ఉప్పలపాడు గ్రామస్తులు ఆంజనేయులు, ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట గ్రామస్తులు చిన్న నరసన్న, గోనెగండ్ల మండలం ఆల్వాల్ గ్రామస్తులు రామాంజనేయులు తదితర ఉల్లి  రైతులతో ఆయన మాట్లాడారు. రైతులు పండించిన ఉల్లిని పరిశీలించారు.  దిగుబడులు ఏ విధంగా వచ్చినది అడిగి తెలుసుకున్నారు. రైతులు  ఎంత ఖర్చు పెడితే ఎంత ఉల్లి దిగుబడి వచ్చినది వివరంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ,  అధిక వర్షాల వల్ల పంట నష్టం తీవ్రంగా ఉందని, దిగుబడి తగ్గిపోయిందని, తమకు మరింత సాయం అవసరమని వేడుకున్నారు.  ఈ సందర్భంగా మంత్రి టి.జి. భరత్ రైతులతో  మాట్లాడుతూ… గత మూడు రోజులుగా రైతులు తమ ఉల్లి పంటను కర్నూలు మార్కెట్ యార్డుకు తీసుకురావడం, రైతులు పడుతున్న ఇబ్బందులను గమనించామని,  వెంటనే అధికారులతో మాట్లాడి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  దృష్టికి ఈ విషయం తీసుకుని వెళ్లినట్టు  తెలిపారు. ఈ కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు అండగా నిలబడాలని నిశ్చయించుకుందని తెలిపారు.  చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని క్వింటాలుకు 1200 రూపాయలకు మార్క్​ ఫెడ్​   ద్వారా కొనుగోలు చేయాలని ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు.  ఈరోజు నుండి కొనుగోలు ప్రారంభించినట్లు మంత్రి తెలియజేశారు.  రైతులు ఇబ్బంది పడకూడదని, నష్ట పోకూడదని  ఉద్దేశంతో ప్రభుత్వం స్వతహాగా ముందుకు వచ్చి కేజీ 12 రూపాయలు చొప్పున కొనడానికి నిశ్చయించినట్టు వివరించారు . ఈ రోజు నుండి కొనుగోలు ప్రారంభించిందని రైతులకు తెలియజేశారు. ఇటువంటి మంచి పనులు చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటారని, ఇది కేవలం ఆయనకే సాధ్యం అని మంత్రి టి.జి. భరత్ రైతులకు తెలియజేశారు. రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోటానికి అధికారులతో సహకరించాలని, మెత్తబడిన ఉల్లిని వేరు చేయాలని కోరారు. రైతులు తమ ఆధార్ కార్డును, బ్యాంక్ అకౌంట్ నంబరు, ఈపాస్ రిసిప్ట్ మొదలగునవి అధికారులకు ఇచ్చినట్లు అయితే ఒక వారం లోపల మీ ఉల్లి డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తారని  రైతులు సహకరించాలని మంత్రి కోరారు. ఈ పర్యటనలో  కడప జేడీ మార్కెటింగ్ రామాంజనేయులు, డిప్యూటీ డైరెక్టర్ లావణ్య,కర్నూలు మార్కెటింగ్ ఏడి నారాయణమూర్తి, మార్కెట్ యార్డ్ సెక్రటరీ జయలక్ష్మి, మార్కెట్ యార్డ్ చైర్మన్ గోల్కొండ హజ్మత్ బీ, వైస్ చైర్మన్ శేషగిరి, కార్పొరేటర్ పరమేష్ పాల్గొన్నారు.

Leave a Reply