ఒంగోలులో ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’
మొక్కలు నాటిన మంత్రి ఆనం
ఆంధ్రప్రభ బ్యూరో, ఒంగోలు : ఒంగోలు (Ongole) నగరంలోని అంజయ్య రోడ్డులో ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ విజన్ లో భాగంగా (Green Ongole) గా చేసే లక్ష్యంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy) డోలా బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ రాజబాబు, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్, మారిటైం బోర్డ్ చైర్మన్ దామచర్ల సత్య, నగర మేయర్ గంగాడ సుజాత, పీడీసీసీ బ్యాంక్ కామేప సీతారామయ్య పలువురు అధికారులు పాల్గొన్నారు.

