పాడే మోసిన మంత్రి అడ్లూరి

పాడే మోసిన మంత్రి అడ్లూరి
పెద్దపల్లి, ఆంధ్రప్రభ : పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కాచపూర్లో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గండు సంజీవ్(Gandu Sanjeev) పాడేను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Adluri Laxman Kumar), ఎమ్మెల్యే విజయ రమణరావు మోశారు. సంజీవ్ గుండె పోటుతో నిన్న హైదరాబాద్(Hyderabad)లో మృతి చెందారు.
ఈ రోజు ఆయన స్వగ్రమమైన జూలపల్లి లో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలకు హాజరైన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు(Chintakunta Vijaya Ramana Rao) పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్లు, డైరక్టర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
