విద్యార్థులతో కలిసి భోజనం…

విద్యార్థులతో కలిసి భోజనం…

లత్తవరంలో పెన్షన్లను పంపిణీ…మంత్రి పయ్యావుల కేశవ్

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎన్టీఆర్ భరోసా పథకం కార్యక్రమంలో భాగంగా మండలంలోని లత్తవరం గ్రామంలో బుధవారం ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిదారుల ఇంటివద్దకే వెళ్లి పెన్షన్లను రాష్ట్ర ఆర్థిక అండ్ ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరించి వారికి స్వయంగా పెన్షన్లను మంత్రి అందజేశారు.

ఈ సందర్భంగా వారితో పలు సమస్యల గురించి అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. అంతకుముందు మంత్రి గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో మంత్రి పూజలు చేశారు. గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

Leave a Reply