బొడ్డెపల్లికి కేంద్రమంత్రి నివాళులు…

బొడ్డెపల్లికి కేంద్రమంత్రి నివాళులు…
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : శ్రీకాకుళం జిల్లా నుండి ఆరు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా సేవలందించిన బొడ్డేపల్లి రాజగోపాలరావు పంచాయతీ స్థాయి నుండి దేశ ప్రజాస్వామ్యానికి అత్యున్నత వేదికైన పార్లమెంట్ వరకు ఎదిగి, తన జీవితాన్ని శ్రీకాకుళం ప్రజల సేవకే అంకితం చేశారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కొనియాడారు.
బొడ్డేపల్లి రాజగోపాలరావు జయంతిని పురస్కరించుకుని గురువారం కేంద్రమంత్రి క్యాంపు కార్యాలయం నుండి విడుదల చేసిన పత్రిక ప్రకటనలో బొడ్డేపల్లి గొప్పదనాన్ని రామ్మోహన్ నాయుడు తెలిపారు ఆయన అంకితభావం, ప్రజా సేవ పట్ల ఉన్న నిబద్ధత తరతరాలకు స్ఫూర్తిదాయకమని కేంద్రమంత్రి అన్నారు.
