Nara Lokesh | ఆత్మీయ విందు భోజనం.. పలకరింపులు…

Nara Lokesh | ఆత్మీయ విందు భోజనం.. పలకరింపులు…

స్నేహ బంధం బలోపేతమే మంత్రి నారా లోకేష్ ఆత్మీయ విందు భోజన రహస్యం..

Nara Lokesh | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నేటి కంప్యూటర్ యుగంలో ఉరుకు పరుగుల రాజకీయ జీవితంలో కొంత ప్రశాంతత, కుటుంబాల ఆత్మీయ కలయిక, పలకరింపు, స్నేహబంధం బలోపేతమే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆత్మీయ విందు అని జిల్లాలోని పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు.నంద్యాల జిల్లాకు చెందిన మంత్రులు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పార్లమెంట్ సభ్యురాలు, డాక్టర్ బైరెడ్డి శబరి నందికొట్కూర్ శ్రీశైలం ఆళ్లగడ్డ డోన్ పాణ్యం శాసనసభ్యులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గౌరవ చరిత రెడ్డి, భూమా అఖిలప్రియ, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, గిత్త జయ సూర్య ల కుటుంబ సభ్యులు బంధువులతో ఉండవల్లిలో అర్ధరాత్రి వరకు విందు భోజనం ఆత్మీయ పలకరింపులు నిర్వహించడం విశేషం.

నంద్యాల జిల్లా ప్రభుత్వ ప్రజా ప్రతినిధుల కుటుంబ సభ్యులకు అమరావతిలో మంత్రి నారా లోకేష్ ఆత్మీయ విందు ఇచ్చారు. ఈ ఆత్మీయ విందులో రాజకీయాలకు అతీతంగా, కుటుంబాల మధ్య స్నేహబంధాన్ని బలపరిచేలా, స్నేహం–సహకారం–సాన్నిహిత్యానికి ప్రతీకగా నిలిచిన ఈ విందు సమావేశం మాకు మరింత ప్రోత్సాహం ఇచ్చిందని మంత్రులు శాసనసభ్యులు ఎంపీ పేర్కొనటం విశేషం. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తరువాత ధ్యామంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజా సంస్కరణలు ప్రజల ఆకర్షితులవుతున్నారని తెలిపారు.

Nara Lokesh |

రాష్ట్ర నాయకత్వం అంటే కేవలం సభలు, సమావేశాలు మాత్రమే కాదు, మనుషుల మధ్య బంధం, అనుబంధాలను పెంచే మనసు కూడా అని, అలాంటి ఆత్మీయతను చూపించిన మంత్రి నారా లోకేష్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నమని శాసనసభ్యులు మంత్రలు ఎంపీ లు పేర్కొన్నారు.మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో కృష్ణానది తీరాన నిర్వహించిన ఆత్మీయ విందు సమావేశం ఉత్సాహభరితంగా సాగింది.

Nara Lokesh | ప్ర‌జా ప్ర‌తినిధుల సంద‌డి…

కృష్ణా నదీజలాల వినియోగ ప్రాంతాలైన నంద్యాల, పార్లమెంటు నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు కుటుంబసభ్యులతో కలిసి హాజరై సందడి చేశారు.అందరినీ ఆత్మీయంగా పలకరించిన లోకేష్ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజాప్రతినిధులు విల్లు-బాణాలను కానుకగా అందించగా, లోకేష్ సరదాగా విల్లు ఎక్కుపెట్టి ఆకట్టుకున్నారు. కుటుంబాలతో కలిసి ఫోటోలు దిగుతూ స్నేహపూర్వక వాతావరణాన్ని నెలకొల్పారు. మహిళలకు మంగళగిరి పట్టుచీరలు అందజేసి సత్కరించారు.

Nara Lokesh |

ఈ ఆత్మీయ సమావేశానికి తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవ చరిత రెడ్డి ప్రధాన కార్యదర్శి ఎన్ ఎం డి ఫిరోజ్ లు, భూమా జగత్ విఖ్యాతరెడ్డి, గౌరు జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యేలు మంత్రులు హాజరయ్యారు. ప్రజాప్రతినిధులు సమర్పించిన గ్రీవెన్స్ స్టేటస్ రిపోర్టులను పరిశీలించి సంబంధిత వారికి అందజేశారు. ఉత్సాహపరితంగా ఈ విందు భోజనం జరగటం ఆనందం కలిగిస్తుందని కార్యకర్తలు పేర్కొనటం విశేషం.

Leave a Reply