Minister | నేడు మంత్రి వాకిటి శ్రీహరి పర్యటన

Minister | నేడు మంత్రి వాకిటి శ్రీహరి పర్యటన
- పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
Minister | అచ్చంపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట పట్టణంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం, ప్రారంభించేందుకు ఈ నెల 12వ తేదీ (గురువారం) ఉదయం 11 గంటలకు రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యకార, క్రీడలు, యువజన సేవల శాఖ మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి అచ్చంపేటకు విచ్చేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ మురళి బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ కార్యక్రమానికి అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు అధ్యక్షత వహించనున్నట్లు ఆయన తెలిపారు.
పట్టణంలో చేపట్టనున్న అభివృద్ధి పనుల వివరాలు ఇలా ఉన్నాయి: వైఎస్‌ఆర్ పార్కు నిర్మాణానికి శంకుస్థాపన, రాజీవ్ ఎన్‌టీఆర్ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ భవన ప్రారంభం, మల్టీపర్పస్ హాల్ భవన మిగులు పనుల నిర్మాణానికి శంకుస్థాపన, శనగకుంట పునరుజ్జీవన, అభివృద్ధి పనులకు శంకుస్థాపన, పట్టణంలో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి శంకుస్థాపన. ఈ అభివృద్ధి పనుల ద్వారా పట్టణ వాసులకు మౌలిక వసతులు మరింత మెరుగవుతాయని అధికారులు తెలిపారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పురపాలక సంఘం కమిషనర్ కోరారు.
