Minister | రైతుల ఎదుటే చీవాట్లు
- ఆఫీసర్లపై మంత్రి ఫైర్
- ధాన్యం కొనుగోళ్లల్లో జాప్యంపై ఆగ్రహం
Minister | మొవ్వ, ఆంధ్రప్రభ : మొవ్వ మండలం కరకంపాడులో రైతుల ఇబ్బందులను మంత్రి కొలుసు పార్థసారధి అడిగి తెలుసుకున్నారు. రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు(Purchase of grain) జరగకపోవడంతో రైతులు తమ ఆవేదనను మంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి ధాన్యం ఎందుకు కొనుగోలు చేయట్లేదని అధికారులను ప్రశ్నించారు. అనంతరం కలెక్టర్, డీఎంతో ఫోన్లో మాట్లాడి తక్షణ చర్యలు(Immediate actions) తీసుకోవాలని ఆదేశించారు.

