Minister | శ్రీశైలంలో మంత్రుల పర్యటన…

Minister | శ్రీశైలంలో మంత్రుల పర్యటన…
- అధికారులతో సమీక్ష సమావేశం…
- అమ్మవారిని దర్శించుకున్న మంత్రులు…
Minister | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలంలోని భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం ను ఈ రోజు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ, రాష్ట్ర రోడ్డు బోనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిలు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు.
ఆలయ మర్యాదలతో మంత్రికి ఘన స్వాగతం పలికిన చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, కార్యనిర్వాణా అధికారి శ్రీనివాసరావు, దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ కార్యనిర్వాహకులు, సిబ్బంది, దర్శనానంతరం మంత్రులకు వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ పరిసరాలు, భక్తులకు అందిస్తున్న సౌకర్యాలు, మౌలిక వసతులను అధికారులతో కలిసి పరిశీలించరు. ఈ నెల 8 వ తేది న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, పారిశుద్ధ్యం, క్యూ లైన్లు, భద్రతా ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. దర్శనానికి వచ్చిన భక్తులతో మంత్రులు మాట్లాడి దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాలపై వారి అభిప్రాయాలు, సూచనలు తెలుసుకున్నారు. శ్రీశైలం మహాక్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేసి అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని వెల్లడించిన మంత్రులు.భక్తుల సౌకర్యాలే ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యమని స్పష్టం చేసిన మంత్రులు.

శివరాత్రి ఏర్పాట్లపై సమీక్ష సమావేశం…
శ్రీశైలంలోని సదాశివయ్య భవన్ లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల నిర్వహణపై ఈ రోజు సంబంధిత అధిక దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, రాష్ట్ర రహదారులు భవనాల శాఖ పెట్టుబడుల మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, హోం శాఖ మంత్రి అనిత, దేవాదాయ కమిషనర్ రామచంద్ర మోహన్, ఇట్స్ ఆఫీస్ యూ సెక్రటరీ హరి జోహార్ లాల్ జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా జిల్లా ఎస్పీ సునీల్ షేరన్, శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు గారు, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, శ్రీశైలం, దోర్నాల, ఆత్మకూరు డిఎఫ్ఓలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
