Minister | రాష్ట్రాన్ని దివాళా తీసింది జగన్ రెడ్డే

Minister | రాష్ట్రాన్ని దివాళా తీసింది జగన్ రెడ్డే

  • ఆర్ధిక నేరస్తుడిని ఆర్ధిక వేత్తలా వైసీపీ నేతలు బిల్డప్ ఇస్తున్నారు..
  • ఐదేళ్ల పాలనలో వ్యవస్థలన్నింటినీ సర్వ నాశనం చేశారు..
  • పేదల బియ్యం బొక్కేసిన పేర్ని నానికి చంద్రబాబును విమర్శించే అర్హత లేదు..
  • కూటమి పాలనలో సంక్షేమం-అభివృద్ధికి అగ్రప్రాథాన్యం..
  • పేర్ని నాని మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారు..

Minister | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అన్ని రకాలుగా జగన్ రెడ్డి నాశనం చేశాడని.. రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి లాంటి ఆర్ధిక నేరస్తుడిని ఆర్ధిక వేత్తగా వైసీపీ నేతలు బిల్డప్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతల వ్యవహార శైలిని తప్పుబట్టారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ప్రజల్ని అప్పుల ఊబిలో నెట్టిన దుర్మార్గ పాలన జగన్ రెడ్డిది అన్నారు. రూ.43 వేల కోట్ల ప్రజల సొమ్ము బొక్కేసిన జగన్ రెడ్డిని, 8000 బస్తాల పేదల బియ్యం బొక్కేసిన పేర్ని నాని కీర్తించడం హాస్యాస్పదం. మద్యం కుంభకోణంలో జగన్ రెడ్డి సహా వైసీపీ నేతల పాత్ర బయటపడుతోంది.

గతంలో ఇసుక అక్రమాలను ప్రశ్నించిన వారి పై, మద్యం అక్రమాల పై నిలదీసిన వారిని నడి రోడ్డు పై చిత్రహింసలు పెట్టారు. చివరికి మాస్కు అడిగిన పాపానికి దళిత డాక్టర్ సుధాకర్‌ను పిచ్చోడిగా చిత్రీకరించి చంపేశారు. అమర్నాథ్ గౌడ్ లాంటి అమాయకులను తగులబెట్టేశారు. అలాంటి పాలన మాకొద్దని ప్రజలంతా ఏకమై కూటమికి ఘన విజయం అందించారు.

రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పడుతున్న శ్రమను చూసి ఓర్వలేక వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఒక్క పెన్షన్ల కోసమే ఇప్పటి వరకు రూ.50 వేల కోట్లు ఖర్చు చేశాం. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నాం. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతు ఖాతాల్లో సొమ్ము జమ చేస్తున్నాం. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం లాంటి సంక్షేమ పథకాలను అమలు చేశాం.

మరోవైపు రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపే లక్ష్యంతో పెట్టుబడులు ఆకర్షిస్తున్నాం. విశాఖలో నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సులో ఏకంగా రూ.13 లక్షల కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించాం. గూగుల్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ఏపీకి రావడంతో ఏపీలో ఏఐ శకం మొదలైంది. మరిన్ని పెట్టుబడులకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇదంతా చంద్రబాబు నాయుడిపై ఉన్న నమ్మకంతోనే రాష్ట్రానికి పెట్టుబడులు వరదలా వస్తుంటే.. వాటిపై బురద వేయాలని జగన్ రెడ్డి అండ్ కో ప్రయత్నిస్తోంది.

ఇండిగో విమానయాన సంస్థ సంక్షోభాన్ని తెలుగుదేశం నాయకులకు ఆపాదించేలా పేర్ని నాని వ్యాఖ్యానించడం సిగ్గుచేటు. పైలట్ల ఫ్లయింగ్ టైమ్ తగ్గించడం అనేది ప్రయాణీకుల భద్రత కోసం తీసుకున్న నిర్ణయం. దాన్ని రాజకీయం చేయడం పేర్ని నాని అజ్ణానానికి నిదర్శనం. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని నిందలేసినా కూటమి ప్రభుత్వం మరో 15 సంవత్సరాలు కొనసాగడం తధ్యం. రాష్ట్రాన్ని సుస్థిరమైన అభివృద్ధి దిశగా నడిపించడమూ తధ్యమని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

Leave a Reply