Minister | వన దేవతల ఆశీర్వాదం ప్రజలపై ఉండాలి..

Minister | వన దేవతల ఆశీర్వాదం ప్రజలపై ఉండాలి..

  • ప్రజా ప్రభుత్వంలో సంక్షేమానికి పెద్దపీట
  • రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్

Minister | కరీంనగర్, ఆంధ్రప్రభ : వన దేవతల ఆశీర్వాదం రాష్ట్ర ప్రజలపై ఉండాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. ఈ రోజు మానకొండూర్ నియోజకవర్గం శంకరపట్నం మండల కేంద్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సమ్మక్క సారలమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి నిలువెత్తు బంగారం సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ… తెలంగాణ ప్రజలందరిపై వనతదేవతలైన సమ్మక్క సారలమ్మ చల్లని చూపు ఉండాలన్నారు. సమ్మక్క సారలమ్మ అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వనదేవతల ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని, రాష్ట్రంలో సమృద్ధి వర్షాలతో పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు.

అలాగే ప్రజా పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చె స్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా ముందుకు పోవాలని అమ్మవారిని వేడుకున్నారు. పేదల కోసం కొనసాగుతున్న కార్యక్రమాలు దిగ్విజయంగా నిరంతరరాయంగా కొనసాగించేలా అమ్మవార్లు చూడాలన్నారు. ఆయన వెంట కుటుంబ సభ్యులతోపాటు కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.

Leave a Reply