Minister | గ్రామాన్నిఆదర్శగ్రామంగా తీర్చిదిద్దుతా.

Minister | గ్రామాన్నిఆదర్శగ్రామంగా తీర్చిదిద్దుతా.

Minister | ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రజలు ఆదరించి ఓటు వేసి గెలిపించారని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని మల్లేపల్లి సర్పంచ్ కథలప్ప అన్నారు. ఈ రోజు నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని మల్లేపల్లిలో సర్పంచుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తల్లిని ఆదరించి వినిపిస్తే గ్రామాభివృద్ధికి ఎంతో కృషి చేశానని అదే అభిమానంతో మరోసారి ప్రజలు తనను ఆదరించి గెలిపించారని అన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి(Minister Vakiti Srihari) సహకారంతో గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించడంతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి మంజూరు చేసే విధంగా చూస్తానని అన్నారు.

గత ఐదేళ్ల పాలనలో గ్రామాన్ని అభివృద్ధి చేయడంతో ప్రజలు మళ్లీ గెలిపించారని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామంలో నెలకొన్న సమస్యలు దశలవారీగా పరిష్కరించి సేవకుడిగా ప్రజలకు సేవ చేస్తానని అన్నారు. నీతి నిబద్ధతతో పాలనా కొనసాగించడంతో ప్రజలు ఆదరించి గెలిపించారని గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు సీసీ రోడ్లు డ్రైనేజీలు ఏర్పాటు చేసి మంత్రి సహకారంతో మల్లేపల్లి గ్రామ రూపురేఖలు మారుస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి చరణ్, కార్యదర్శి సుమన్, ఉప సర్పంచ్ రాము, వార్డు సభ్యులు తనుజ, భాగ్యమ్మ సరస్వతి శివప్ప బాలప్ప మనిషా నరసింహులు బజరప్ప వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply