గన్నవరంలో లారీని ఢీకొన్న మినీ బస్సు

గన్నవరంలో లారీని ఢీకొన్న మినీ బస్సు

ఆంధ్రప్రభ, గన్నవరం (కృష్ణాజిల్లా) కృష్ణాజిల్లా (Krishna District), గన్నవరం జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదంలో.. విజయవాడ ఇంద్రకీలాద్రికి వస్తున్న భవానీలకు ప్రాణగండం తప్పింది. రావ్ ఫిన్ రియల్ ఎస్టేట్ మెయిన్ గేట్ ఎదురుగా ఈ ప్రమాదం జరిగింది సోమవారం తెల్లవారుజామున సుమారు 3.30 గంటలకు నాయుడుపేట ఏరియా నుంచి విజయవాడ వైపు ధాన్యం లోడుతో వస్తున్న ఏపీ 16 టి యు 9946 లారీకి వెనుక టైరు పంక్చర్ కావటంతో డ్రైవర్ లారీని రోడ్డు పక్కన నిలిపారు.

అదే సమయానికి ద్రాక్షారామం నుండి విజయవాడ (Vijayawada) వైపు వస్తున్న ఏపీ 31 టీహెచ్ 8348 భవానీల మినీ బస్సు లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ వెనక నిలబడి వచ్చే వాహనాలకు లైట్ చూపిస్తూ సిగ్నల్ ఇస్తున్న లారీ క్లీనర్ కు తీవ్రంగా గాయపడ్డాడు. మినీ బస్సులోని భవావీలు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకున్న పోలీసులు బాధితులను ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ రద్దీని నియంత్రించారు.

Leave a Reply