ముంబయి | ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఘన విజయం సాధించింది.
.ఆర్ సి బి నిర్ధారిత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 221 పరుగులు చేసింది. ముంబై గెలవాలంటే 222 పరుగులు చేయాల్సి ఉంది. అయితే తొమ్మిది వికెట్ల నష్టానికి 209 చేసింది. దీంతో 12 పరుగుల తేడాతో ఆర్ సి బి విజయం సాధించింది. హార్దిక్, తిలక్ వర్మ పోరాడినప్పటికీ ముంబై కి ఓటమి తప్పలేదు.
ముంబై బ్యాటింగ్ లో రోహిత్ శర్మ 17, రికెల్టన్ 17, విల్ జాక్స్ 22, సూర్య కుమార్ 28, తిలక్ వర్మ 56, హార్దిక్ 42, నమన దీర్ 11 పరుగులు చేశారు.
ముంబై బౌలింగ్ లో కునాల్ పాండ్యా కీ నాలుగు వికెట్లు దక్కాయి. హెజెల్ వుడ్ , యాష్ దయాల్ కు రెండేసి వికెట్లు, భువికి ఒక వికెట్ లభించింది.
కాగా, ఆర్ సి బి బ్యాటింగ్ లో ఓపెనర్ సాల్ట్ నాలుగు పరుగులకు ఔట్ . కోహ్లి, పడిక్కళ్ లు ముంబై బౌలర్ల పై విరుచుకు పడ్డారు. పవర్ ప్లే లో ఈ ఇద్దరూ కలిసి 69 పరుగులు చేశారు. అనంతరం. దూకుడుగా ఆడుతున్న పద్దిక్కల్ ను విఘ్నేష్ ఔట్ చేశాడు. పద్దిక్కల్ 37 పరుగులు చేశాడు. కోహ్లీ ఈ దశలో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. కోహ్లీ 67, రజత్ పటే దార్ 64, లివింగ్‌స్టన్ సున్నా పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు. జితేష్ శర్మ 40, టీమ్ డేవిడ్ ఒక్క పరుగుతో నాటౌట్ గా ఉన్నారు.
ముంబాయి బౌలర్ లో బోల్ట్, హార్దిక్ లకు రెండేసి వికెట్లు లభించగా విగ్నెస్ ఒక వికెట్ తీసుకున్నాడు. నేడు బౌలింగ్ చేసిన జస్ప్రీత్ బుమ్రా తన నాలుగు ఓవర్లలో ఒక్క వికెట్ పడగొట్ట కుండా 29 పరుగులు సమర్పించుకున్నాడు