MI vs LSG | ముంబైకి ఆదిలోనే షాక్..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ లో భాగంగా ఈరోజు మ‌రో ర‌స‌వ‌త్త‌ర పోరుకు రంగం సిద్ధ‌మైంది. వాంఖడే స్టేడియం వేదిక‌గా ముంబైతో లక్నో జ‌ట్టు తలపడనుంది. పాయింట్ల పట్టికలో 10 పాయింట్లతో 5, 6వ స్థానాల్లో ఉన్న ఈ రెండు జట్లు.. టాప్ 4లోకి ప్రవేశించడానికి పోటీ పడుతున్నాయి.

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో ముంబైని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కాగా, ముంబై ఇండియ‌న్స్ కు తొలి ఇన్నింగ్స్ ఓపెన‌ర్ ర్యాన్ రికెల్ట‌న్ మంచి ఆరంభం ఇచ్చాడు. అయితే మ‌రో ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ (12) కూడా అదే జోరులో రెండు బాది మూడో సారి క్యాచ్ ఔట‌య్యాడు. దీంతో 2.5 ఓవ‌ర్లో ముంబై తొలి వికెట్ కోల్పోయింది.

ప్ర‌స్తుతం క్రీజులో ర్యాన్ రికెల్ట‌న్ – విల్ జాక్స్ ఉన్నారు.

Leave a Reply