MI vs CSK | ఛేజింగ్ లో చిత‌క్కొట్టిన ముంబై.. చెన్నైకి త‌ప్ప‌ని మ‌రో ఓట‌మి

ముంబై: ఈరోజు జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ భారీ విజయాన్ని నమోదు చేసింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ – మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ అర్ధ శ‌త‌కాల‌తో విజృంభించారు. దాంతో చెన్నై జ‌ట్టును ముంబై 9 వికెట్ల‌తో చిత్తు చేసింది.

బ్యాక్ టూ బ్యాక్ విజ‌య‌లాతో తిరిగి పామ్ లోకి వ‌చ్చింది ముంబై. కాగా, నేటి మ్యాచ్ లో చెన్నైపై విజ‌యంతో త‌మ ఖాతాలో 8 పాయింట్లు వేసుకున్న ఎంఐ.. 6వ స్థానానికి చేరుకుంది.

ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ చేపిన సీఎస్కే ముంబై ముందు 177 ప‌రుగుల ల‌క్ష్యం సెట్ చేసింది. అయితే ఈ ఛేజ్ లో ఎంమై టాపార్డ‌ర్ బ్యాట‌ర్లు చిత‌క్కొట్టారు. ఓపెన‌ర్ ర్యాన్ రిక‌ల్ట‌న్ (24) ప‌రుగుల‌కు ఔట‌వ్వాగా.. రోహిత్ శ‌ర్మ (45 బంతుల్లో 4ఫోర్లు, 6 సిక్సులు ; 76 నాటౌట్‌), సూర్య కుమార్ (30 బంతుల్లో 6ఫోర్లు, 5సిక్సులు ; 68 నాటౌట్‌) ఆకాశమే హద్దుగా చెలరేగారు.

రిక‌ల్ట‌న్ (24) ఔటైన తరువాత వ‌న్ డౌన్ లో వ‌చ్చిన సూర్య కుమార్ తో క‌లిసి… రోహిత్ శ‌ర్మ బ్యాట్ ఝళిపించాడు. సీఎస్కే బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపిస్తూ.. బౌండ‌రీలు వ‌ర్షం కురిపించారు.

ర్యాన్ రిక‌ల్ట‌న్ – రోహిత్ శ‌ర్మ క‌లిసి తొలి వికెట్ కు 40 బంతుల్లో 63 ప‌రుగులు జోడించ‌గా.. సూర్య కుమార్ యాద‌వ్ – రోహిత్ శ‌ర్మ క‌లిసి రెండో వికెట్ కు 54 బంతుల్లో 114 ప‌రుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దాంతో చెన్నై నిర్ధేశించిన 177 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 15.4 ఓవ‌ర్ల‌లోనే ఛేదించింది ముంబై.

రాణించిన రవీంద్ర, శివమ్‌..

అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ రచిన్‌ రవీంద్ర (5)ను అశ్వనీ కుమార్‌ ఇంటిదారి చూపించాడు. తర్వాత మరో ఓపెనర్‌ ఆంధ్ర కుర్రాడు షేక్‌ రషీద్‌ (19), ఆయుష్‌ మాత్రే (32; 15 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడైన బ్యాటింగ్‌తో సీఎస్కేను ఆదుకునే ప్రయత్నం చేశారు.

కానీ, ముంబై బౌలర్లు స్వల్ప వ్యధిలోనే వీరిద్దరి ఔట్‌ చేయడంతో చెన్నై 63 స్కోరు వద్ద 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా (53 నాటౌట్‌; 35 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), శివమ్‌ దూబే (50; 32 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) సూపర్భ్‌ హాఫ్‌ సెంచరీలతో చెన్నైను ఆదుకున్నారు.

దీంతో చెన్నై నిర్ణీత ఓవర్లలో 176/5 పరుగులు చేసింది. ధోనీ 4 పరుగులే చేసి ఔటయ్యాడు. ముంబై బౌలర్లలో బుమ్రా 2 వికెట్లు తీయగా.. దీపక్‌ చాహర్‌, అశ్వనీ కుమార్‌, సాంట్నర్‌ తలా వికెట్‌ దక్కించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *