MG | ఏడాదిలో 50వేల యూనిట్ల అమ్మకాలు…

MG | ఏడాదిలో 50వేల యూనిట్ల అమ్మకాలు…
గురుగ్రామ్ : MG విండ్సర్ కేవలం ఒక సంవత్సరంలోనే 50,000 యూనిట్ల అమ్మకాల మైలురాయిని దాటింది. ఈ విజయంతో, విండ్సర్ భారతదేశంలో 4W-EV విభాగంలో అత్యంత వేగంగా 50,000 అమ్మకాలు నమోదు చేసిన తొలి ఎలక్ట్రిక్ వాహనంగా గుర్తింపు పొందింది. ఈ మైలురాయి, కంపెనీకి చారిత్రాత్మకమైనదిగా, అలాగే EV మార్కెట్‌లో విండ్సర్ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసినదిగా భావిస్తున్నారు.
మెట్రో నగరాల పాటు మెట్రో యేతర ప్రాంతాలలో కూడా విండ్సర్‌కు భారీ డిమాండ్ రావడం, భారత వినియోగదారుల్లో స్థిరమైన మొబిలిటీపై అవగాహన, స్వీకరణ పెరుగుతున్నదనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. వినూత్న డిజైన్, విశ్వసనీయ పనితీరు, ఆధునిక ఫీచర్లు, అలాగే మెరుగైన యాజమాన్య అనుభవం కలిసి విండ్సర్ ప్రజాదరణను గణనీయంగా పెంచాయి.
ఈ సందర్భంగా JSW MG మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అనురాగ్ మెహ్రోత్రా మాట్లాడుతూ, “విండ్సర్ EV ప్రారంభ సమయంలో మా లక్ష్యం ఆచరణాత్మకమైన, స్టైలిష్ , విలువ ఆధారిత మొబిలిటీ సొల్యూషన్‌ను అందించడం. విండ్సర్ రికార్డు సమయంలో 50,000 అమ్మకాల మైలురాయిని చేరడం, భారతదేశ EV ప్రయాణంలో ఒక ముఖ్యమైన క్షణం. వినియోగదారులు ఈ మార్పును సంపూర్ణంగా స్వీకరిస్తున్నారని ఇది నిరూపిస్తుంది. న్యూ ఎనర్జీ వాహనాలపై మా నిబద్ధతను మరింత బలపరుస్తూ, భారత మొబిలిటీ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో మా ప్రయాసలను కొనసాగిస్తాము” అని అన్నారు.
ఇటీవల కంపెనీ MG విండ్సర్ ఇన్‌స్పైర్ పేరుతో ఒక పరిమిత ఎడిషన్ సిరీస్‌ను ఆవిష్కరించింది. ఈ ప్రత్యేక ఎడిషన్‌ను కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ అధికారికంగా విడుదల చేశారు.
