యోగ ద్వారా మానసిక ప్రశాంతత..

యోగ ద్వారా మానసిక ప్రశాంతత..

వికారాబాద్, ఆంధ్రప్రభ : ప్రతి రోజు జీవితంలో యోగ చేయడం ద్వారా ఒత్తిడి తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుందని జిల్లా జడ్ పిసిఇఓ సుదీర్ తెలిపారు. శుక్రవారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అంతర్జాతీయ హొమియోపతి డే సందర్బంగా ఆయుష్ వారి ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇది కలెక్టరేట్ కార్యాలయ గ్రౌండ్ లో జరిగింది.

ఈ సందర్బంగా మాట్లాడుతూ.. యోగ అనేది శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన సాధనంగా గుర్తించబడిందని, రోజు వారీ జీవితంలో యోగాను అలవాటు చేసుకోవడం ద్వారా ఒత్తిడి తగ్గి, శరీరానికి శక్తి, మనసుకు ప్రశాంతత లభిస్తాయని, యోగా మన శరీరానికి, మనసుకు సమతుల్యతను అందించే సాధనమని తెలిపారు. యోగా సాధన ద్వారా జీవనశైలిలో మార్పు వస్తుందని, అనేక వ్యాధులను నివారించుకోవచ్చని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు.

ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా యోగా సాధన పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా యోగా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. అనంతరం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో అంతర్జాతీయ హొమియోపతీ డే, శ్యామియోల్ హనిమ్యాన్ జన్మ దినం సందర్భంగా ఆయన చిత్ర పటానికి పులా మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారి స్వర్ణ కుమారి, మిషన్ భగిరథ రవి కుమార్, బి సి వెల్ఫేర్ అధికారి మాధవ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ విక్రమ సింహ రెడ్డి, ఆయుష్ ఇంచార్జి అధికారి డాక్టర్ సునీత, డిపిఏం వంశీ, త్రైనర్స్ సంధ్య, రాజేష్, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply