క్రీడలతో మానసిక ఉల్లాసం..

క్రీడలతో మానసిక ఉల్లాసం..

అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సంసిద్ విద్యార్థులు
శావల్యాపురం, (ఆంధ్రప్రభ)
క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని సంసిద్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాగర్ బాబు అన్నారు. జిల్లా స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సంసిద్ విద్యార్థులను శుక్రవారం ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుంటూరులోని ఎన్టీఆర్ స్టేడియంలో ఈ నెల 5న జరిగిన జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో అదే విధంగా కోటప్పకొండ జడ్పీ పాఠశాలలో ఈ నెల 4న జరిగిన డివిజన్ స్థాయి క్రీడల్లో సంసిధ్ పాఠశాల విద్యార్థులు అత్త్యుత్తమ ప్రతిభను కనబరచి విజేతలుగా నిలిచినట్లు తెలిపారు.

జిల్లా స్థాయి 600 మీటర్ల రన్నింగ్లో హంసవర్ధిని ప్రథమస్థానాన్ని, అండర్-17 డివిజన్ స్థాయి 800 మీటర్ల రన్నింగ్లో నాసరయ్య ప్రథమస్థానాన్ని సాధించగా, అండర్-14 మహిళల 400 మీటర్ల రన్నింగ్ లో హంసవర్ధిని ప్రథమస్థానాన్ని, 600 మీటర్ల రన్నింగ్లో ద్వితీయస్థానాన్ని సాధించిందన్నారు. సాత్విక 200 మీటర్ల రన్నింగ్లో ప్రథమ స్థానాన్ని, వరుణ్కార్తీక్ 400 మీటర్ల రన్నింగ్లో తృతీయస్థానాన్ని, 600 మీటర్ల రన్నింగ్లో ద్వితీయస్థానాన్ని సాధించినట్లు తెలిపారు. అండర్-14 షార్ట్పుట్లో అవినాష్, షణ్ముఖిలు ఇద్దరూ తృతీయస్థానాలు సాధించినట్లు తెలిపారు. గెలుపొందిన విద్యార్థులను అభినందించిన వారిలో పీడీ నాయుడు, ఉపాధ్యాయులు ఉన్నారు.

Leave a Reply