Meghalaya | బొగ్గుగనిలో భారీ పేలుడు.. 10మంది మృతి

Meghalaya | బొగ్గుగనిలో భారీ పేలుడు.. 10మంది మృతి
Meghalaya | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : బొగ్గుగనిలో భారీ పేలుడు సంభవించడంతో పది మంది మృతిచెందగా, పలువురికి గాయాలైన ఘటన మేఘాలయలోని తూర్పు జైంటియా హిల్స్ జిల్లాలో ఇవాళ జరిగింది. ఈ ఘటనలో 10మంది కూలీలు మరణించగా, పలువురు గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది అస్సాంకు చెందినవారు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
థాంగ్స్కు ప్రాంతంలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సహాయక చర్యల కోసం రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాన్ని అధికారులు కోరారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
