Meghalaya | పెళ్లైన మూడు నెలలకే…

Meghalaya | పెళ్లైన మూడు నెలలకే…
Meghalaya | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మేఘాలయ హనీమూన్ మర్డర్‌ను తలపించేలా రాజస్థాన్‌లో ఓ దారుణం చోటుచేసుకుంది. పెళ్లైన కొన్ని నెలలకే ఓ యువతి దారుణానికి ఒడిగట్టింది. ప్రియుడితో కలిసి భర్తను చంపింది. పెళ్లైన మూడు నెలలకే భర్తను భార్య తన ప్రియుడులో కలిసి హత్య చేయించిన ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం… రాజస్థాన్‌లో పెళ్లై 3 నెలలు గడవకముందే భర్త ఆశిష్‌ను భార్య అంజు తన ప్రియుడు సంజూతో కలిసి హత్య చేయించినట్లు పోలీసులు గుర్తించారు. రాత్రి సమయంలో దంపతులు రోడ్డుపై నడుస్తుండగా సంజూ కారుతో ఆశిష్‌ను ఢీకొట్టి పరారయ్యాడు.
మొదట ప్రమాదంగా చిత్రీకరించేందుకు అంజు ఇచ్చిన వాగ్మూలంలో అనేక అనుమానాలు తలెత్తడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో అంజుకు ఇంటి సమీపంలో నివసించే సంజూతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను విచారిస్తున్నారు.
