Megastar | శశిరేఖ సాంగ్ వచ్చేసింది..
Megastar, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ మన శంకర్ వరప్రసాద్ గారు. ఈ మూవీని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) తెరకెక్కిస్తున్నారు. ఇందులో చిరు, నయన్ జంటగా నటిస్తున్నారు. అనిల్ రావిపూడి పక్కా ప్లానింగ్ తో షూటింగ్ చేస్తుండడంతో అనుకున్న టైమ్ కంటే కాస్త ముందుగానే షూటింగ్ కంప్లీట్ అయ్యేలా ఉంది. ఓ వైపు షూటింగ్ చేస్తూనే.. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారు. అలాగే.. ప్రమోషన్స్ లో కూడా స్పీడు పెంచారు మేకర్స్. ఇటీవల ఈ మూవీ నుంచి మీసాల పిల్లా అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ పాటకు అనూహ్య స్పందన వచ్చింది.
ఇప్పుడు ఈ మూవీ నుంచి శశిరేఖ.. అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. అసలు ఈ పాటను ఈ నెల 8న రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. ఒక రోజు ముందుగానే ఈ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించారు. మధుప్రియతో కలిసి స్వీయ సంగీత దర్శకత్వంలో భీమ్స్ ఈ పాటను పాడారు. ఈ సాంగ్ లో చిరు వావ్ అనిపించే లుక్ తో పాటు తనదైన స్టైల్ లో డ్యాన్స్ తో అదరగొట్టారు. ఇందులో విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్ చేస్తుండడం విశేషం. ఇటీవల చిరు, వెంకీల పై (Venkatesh) సాంగ్ షూట్ చేశారు. సంక్రాంతికి మన శంకర్ వరప్రసాద్ గారు మూవీ థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. మరి.. మీసాల పిల్లా సాంగ్ వలే.. శశిరేఖ సాంగ్ కూడా యూట్యూబ్ ని షేక్ చేసి రికార్డ్ వ్యూస్ తో దూసుకెళతాదేమో చూడాలి.


