Megastar | అనిల్ మరోసారి మ్యాజిక్ చేశాడా…?

Megastar | అనిల్ మరోసారి మ్యాజిక్ చేశాడా…?

Megastar | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన భారీ చిత్రం మన శంకర్ వరప్రసాద్ గారు. ఇందులో విక్టరీ వెంకటేష్.. కీలక పాత్ర పోషించడం విశేషం. చిరుకు జంటగా అందాల తార నయనతార నటించింది. భోళా శంకర్ మూవీ నిరాశపరచడంతో.. ఈసారి ఎలాగైనా సరే.. బ్లాక్ బస్టర్ సాధించాలని చిరు ఎంతో తపనతో చేసిని సినిమా (Movie) ఇది. భారీ అంచనాలతో మన శంకర్ వరప్రసాద్ గారు మూవీ థియేటర్స్ లోకి వచ్చింది. మరి.. మన శంకర్ వరప్రసాద్ గారు మూవీ ఎలా ఉంది..? రియల్ టాక్ ఏంటి..?

Megastar | కథ ఇదే..

శంకర్ వరప్రసాద్ (చిరంజీవి) ఇంటలిజెన్స్ విభాగంలో సిన్సియర్ అండ్ సీరియస్ ఆఫీసర్. ఆయన హోమ్ మినిష్టర్ (శరత్ సక్సెనా)ని ఓ పెద్ద ప్రమాదం నుంచి తప్పిస్తాడు. దీంతో ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంటుంది. ఒకసారి.. తనకు భార్యతో విడాకులు తీసుకున్నానని.. పిల్లలను చూడాలనిపిస్తుందని.. తన బాధను చెప్పుకుంటాడు వరప్రసాద్. నవ్వుతూ.. నవ్వించే వరప్రసాద్ వెనకాల ఇంత బాధ ఉందా అని ఆశ్చర్యపోయిన హోమ్ మినిష్టర్ వరప్రసాద్ కోసం ఏదైనా చేయాలి అనుకుంటాడు. అలాగే వరప్రసాద్ (Vara Prasad) తన భార్య, పిల్లలకు దగ్గరవ్వాలని ప్రయత్నిస్తాడు. అయితే..తన మామగారికి ప్రాణహాని ఉందని తెలిసి అత్తగారింటికి సెక్యురిటీ ఆఫీసర్ గా వస్తాడు. ఇంతకీ.. వరప్రసాద్ మామగారికి వచ్చిన ఆపద ఏంటి..? భార్య, పిల్లలకు దగ్గరవ్వాలనుకున్న వరప్రసాద్ వాళ్లకు దగ్గరయ్యాడా..? లేదా..? వీళ్ల కథలోకి వెంకీ గౌడ (వెంకటేష్‌) ఎందువచ్చాడు..? వెంకీ వచ్చిన తర్వాత ఏమైంది..? అనేదే ఈ సినిమా కథ.

Megastar

Megastar | చిరు కామెడీ యాంగిల్..

ఈ సినిమాకి వచ్చిన రియల్ టాక్ ఏంటంటే.. అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఇప్పటి వరకు తెరకెక్కించిన సినిమాల్లో చెప్పుకోవడానికి పెద్దగా కథ ఉండదు. ఎంటర్ టైన్మెంట్ తో ధియేటర్స్ కి వచ్చిన ప్రేక్షకులను లాజిక్ లు లేకుండా మ్యాజిక్ లు చేసి నవ్వించి పంపిస్తాడు. ఈ సినిమాకి కూడా అలాగే చేశాడట. మెగాస్టార్ లో ఉన్న కామెడీ యాంగిల్ ను మరోసారి బయటకు తీసాడట అనిల్. చిరు చేసే కామెడీ, డ్యాన్స్, ఫైట్స్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకునేలా డిజైన్ చేశాడట. చాలా రోజుల తర్వాత చిరు ఎంటర్ టైన్మెంట్ రోల్ లో కనిపించడం అదిరింది అంటున్నారు.

Megastar

Megastar | వెంకీ.. వేరే లెవల్..

చిరు, నయన్ పై వచ్చిన సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయట. అలాగే లేడీస్ కి, జంట్స్ కి నచ్చేలా డిజైన్ చేసిన కొన్ని సీన్స్ అయితే.. థియేటర్స్ లో (Theatres) ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకునేలా డిజైన్ చేశాడట. ఇక కీలక పాత్ర పోషించిన వెంకీ రోల్ కి ఇచ్చిన ఎలివేషన్స్, వెంకీ గెటప్, స్టైల్.. చిరు, వెంకీని ఒకే ఫ్రేమ్ లో చూడడం.. అభిమానులే కాదు.. కామన్ ఆడియన్స్ కు సైతం విపరీతంగా నచ్చలా ఉందట. ఇంకా చెప్పాలంటే.. వెంకీ క్యారెక్టర్ ఎంటర్ టైన తర్వాత నుంచి ఈ మూవీ నెక్ట్స్ లెవల్ కి వెళ్లింది అంటున్నారు సినిమా చూసిన జనాలు. ఒక్క మాటలో చెప్పాలంటే.. చెప్పుకోదగ్గ కథలేకపోయినా.. అనిల్ మరోసారి మ్యాజిక్ చేశాడనేది రియల్ టాక్. మరి.. బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.

Megastar

CLICK HERE TO READ అన్న గారు వస్తారు..

CLICK HERE TO READ MORE

Leave a Reply