Megastar | నాన్నకు ప్రేమతో.. – సుస్మిత

Megastar | నాన్నకు ప్రేమతో.. – సుస్మిత

Megastar | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి కాంబోలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ మన శంకర వర ప్రసాద్ గారు. ఈ మూవీ చిరు ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఇందులో విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) కీలక పాత్రలో నటించడం విశేషం. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ల పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటించారు. సినిమా ప్రమోషన్‌లు అద్భుతంగా జరుగుతున్నాయి. ట్రైలర్, సాంగ్స్ సినిమా పై అంచనాలను భారీగా పెంచాయి. మన శంకర వర ప్రసాద్ గారు సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా జనవరి 12న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత సుస్మిత కొణిదెల మీడియా సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ఆ విశేషాలు మీ కోసం..

Megastar

Megastar | మైల్ స్టోన్ ప్రాజెక్ట్..

సెన్సార్ నుంచి చాలా మంచి రిపోర్ట్ (Report) వచ్చింది. సినిమాని చాలా ఎంజాయ్ చేశారు. క్లీన్ ఫిల్మ్. ఫుల్ ఫ్యామిలీ ఫన్. పిల్లలు, ఫ్యామిలీతో కలసి అందరూ చూసే సినిమా అని చెప్పారు. ఈ సినిమా గురించి చెప్పాలంటే.. ఇది మైల్ స్టోన్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాం. నాన్నగారి కోర్ జానర్ లో చేయడం, అనిల్ గారు ఆ జానర్ ని తీసుకోవడం సూపర్బ్. సాహు గారితో జర్నీ బ్యూటీఫుల్. ఇది చాలా ఎంజాయ్ చేస్తూ చేసిన మైల్ స్టోన్ ప్రాజెక్ట్. ఈ కాంబినేషన్ మళ్ళీ కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాను.

Megastar

Megastar | ఆతర్వాత మరింత ఫన్..

నాన్న గారు బరువు తగ్గడంతో పాటు ఫిట్ నెస్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. చాలా కొత్త ఛార్మ్ తో కనిపించారు. దీంతో ఆయనకి కాస్ట్యుమ్స్ డిజైన్ చేయడం కూడా మాకు ఈజీ అయ్యింది. అలాగే అనిల్ గారు ఆయన్ని ఒక స్టయిల్ లో చూపించాలని అనుకున్నారు. ఆయన వైపు నుంచి కూడా చాలా ఇన్పుట్స్ ఇచ్చారు. అందరం ఒకే విజన్ తో పని చేశాం. వెంకటేష్ (Venkatesh) గారు బిగ్ ఇంపాక్ట్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపిస్తారు. ఆయన వచ్చిన తర్వాత ఫన్ మరింత గా రైజ్ అవుతుంది. చాలా ముఖ్యమైన పాత్ర. చాలా ఎంటర్‌టైన్‌మెంట్ వున్న రిచ్ క్యారెక్టర్.

Megastar

Megastar | ఈ మూవీతో అది నేర్చుకున్నాను..

నేర్చుకోవాలనే తపన వుంటే ఆయన నుంచి ప్రతి రోజు ఒక పాఠం నేర్చుకోవచ్చు. ఈ సినిమాలో జర్నీ చేస్తున్నప్పుడు ఒక పని మొదలుపెట్టిన తర్వాత దాని కోసం ప్రాణం పెట్టి నిజాయితీగా హార్డ్ వర్క్ చేయాలనేది నేర్చుకున్నాను. డాడీ ఇంట్లో మా అందరితో చాలా ఫన్ ఫుల్ గా వుంటారు. ఒకసారి సెట్ లో అడుగుపెట్టిన తర్వాత ఆయన పూర్తి దృష్టి క్యారెక్టర్ పైనే వుంటుంది. ఈ రోజుకీ ఒక ఫస్ట్ టైమర్ లా ఆయన ప్రిపరేషన్ వుంటుంది. భీమ్స్ మ్యూజిక్ గురించి చెప్పాలంటే.. మ్యూజిక్ అద్భుతంగా చేశారు. పాటలు పెద్ద హిట్ అయ్యాయి. రీరికార్డింగ్ (Recording) కూడా అదిరిపోతుంది. ఇందులో కామెడీ యాక్షన్ ఎమోషన్ అన్ని ఎలిమెంట్స్ వుంటాయి. చిరంజీవి గారి నుంచి ఏమైతే మిస్ అయ్యామో అవన్నీ ఇందులో వుంటాయి. మనమంతా చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగాం. అలాంటి చిరంజీవి గారిని ఇందులో చూస్తారు. చిరంజీవి గారు, అనిల్ రావిపూడి గారు కలిస్తే ఎంత ఎంటర్టైమెంట్ వుంటుందో ఇందులో చూస్తారు అన్నారు.

Megastar

CLICK HERE TO RAED బాలీవుడ్ స్టార్స్ ను దింపుతున్న అట్లీ..

CLICK HERE TO READ MORE

Leave a Reply