ముత్యంపేటలో మెగా పశువైద్య శిబిరం

దండేపల్లి, అక్టోబర్ 15(ఆంధ్రప్రభ) : పశు సంవర్ధక శాఖ అధ్వర్యంలో దండేపల్లి మండలం ముత్యంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన మెగా పశు వైద్య శిబిరాన్ని (veterinary camp) మంచిర్యాల జిల్లా పశు వైద్యాధికారి డా.శంకర్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రైతులు పాడి, పశు సంపదపై దృష్టి సారించి అధిక లాభాలు పొందవచ్చన్నారు. పశువులకు వ్యాధులు రాకుండా పశువుల కొట్టాలని శుభ్రంగా ఉంచుకోవాలని, వాటికి సరైన పౌష్టికాహారం అందించాలని పేర్కొన్నారు. పశుగ్రాసం (Fodder) కోసం ప్రభుత్వం గడ్డి విత్తనాలు పంపిణీ చేస్తుందని తెలిపారు. గాలికుంటు వ్యాధి సోకితే వెంటనే టీకాలు వేయించాలని వివరించారు.

ఈ సందర్భంగా 280 పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు, వైద్య చికిత్సలు (Medical treatments) చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆర్టీఏ సభ్యుడు అంకతి శ్రీనివాస్, అసిస్టెంట్ డైరెక్టర్ డా.యాకుబ్ రెడ్డి, పశువైద్యులు డా.ధనరాజ్, డా.భూమయ్య, సుజాత, లక్సెట్టిపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బండ రాకేష్, కట్కూరి రాజన్న, నాయకులు గడ్డం త్రిమూర్తి, ముత్యాల శ్రీనివాస్, ఆశోక్, వెంకటేష్, పశువైద్య సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Leave a Reply