Mega Master Plan | ఫ్యూచర్ తెలంగాణ 3 వర్టికల్స్!

Mega Master Plan | ఫ్యూచర్ తెలంగాణ 3 వర్టికల్స్!
- కోర్ అర్బన్.. సెమీ అర్బన్.. గ్రామీణం
- మొదటిసారిగా రాష్ట్రం మొత్తానికి ఒక మెగా పాలసీ
- తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి మాస్టర్ ప్లాన్
హైదరాబాద్, ఆంధ్రప్రభ : ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం మెగా మాస్టర్ ప్లాన్ రూపొందించుకుంది. దేశంలోనే మొట్టమొదటిసారి ఒక రాష్ట్రం మొత్తానికి ఒక మెగా పాలసీ అమలు చేస్తున్నది. పాలసీ డాక్యుమెంట్ ఓపెన్ చేసి మాస్టర్ ప్లాన్ చూస్తే ఎక్కడ ఏ రంగం రావాలి, ఎక్కడ గుణాత్మక అభివృద్ధి చేయాలో దానిలో వివరంగా పొందుపరుస్తారు. ఇందులో భాగంగా తెలంగాణను మూడు వర్టికల్స్ కింద డివైడ్ చేయనున్నారు.
అవుటర్ రింగ్ రోడ్ లోపల భాగం ‘కోర్ అర్బన్’ ప్రాంతం. అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజినల్ రింగ్ రోడ్ లోపల భాగం ‘సెమీ అర్బన్’ ప్రాంతం. రీజినల్ రింగ్ రోడ్ నుంచి తెలంగాణ కారిడార్స్ వరకు ‘గ్రామీణ’ ప్రాంతం. కోర్ అర్బన్ ప్రాంతంలో సేవారంగం ఉంటుంది.
సెమీ అర్బన్ ప్రాంతంలో పారిశ్రామిక రంగం ఉంటుంది. ప్రణాళికా బద్ధమైన అభివృద్ధి, ఏకరూప పరిపాలనే లక్ష్యంగా రాజధానిని ప్రపంచ స్థాయి మౌలిక సౌకర్యాలతో తీర్చిదిద్దేందుకు రాష్ట్ర సర్కార్ శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కలిపి 27 పట్టణ స్థానిక సంస్థలను(యూఎల్‌బీ) జీహెచ్‌ఎంసీలో విలీనం చేసేందుకు సమాయత్తమైంది. 650 చ.కి.మీ పరిధిలో ఉన్న జీహెచ్‌ఎంసీని 2 వేల చ.కి.మీ పరిధికి విస్తరించేందుకు చర్యలు ప్రారంభించింది.
మూడు ప్రాంతాల వర్గీకరణ…
రీజినల్ రింగ్ రోడ్ బయట వ్యవసాయ రంగం ఉంటు-ంది. ప్రభుత్వమే ఇలా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయాలి అను కుంటోంది, ఆ ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆధారంగా ఇన్వెస్టర్లు వారి ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చు అని ప్రభుత్వ ఆలోచన. ఇవన్నీ అమలు చేసే క్రమంలో ఎక్కడైనా డీవియేషన్లు, వయుెెలేషన్లు ఉన్నప్పుడు నియంత్రించడానికి కొన్ని కొత్త సంస్థలు ప్రభుత్వం తీసుకొస్తుంది, హైడ్రా కూడా ఇందులో భాగమేనని ప్రభుత్వం చెబుతోంది.
పెట్టుబడులను ప్రోత్సహించేందుకు, పెట్టుబడిని రక్షించేందుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది. హైదరాబాద్ మహానగరం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజల అవసరా లు దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్తు తరాలకు సౌకర్యంగా ఉండేవిధంగా ప్రపంచస్థాయిలో కొత్త సిటీని నిర్మించాలనే ఆలోచన నుంచి పుట్టిందే ఈ ‘ఫ్యూచర్ సిటీ’. ప్రపంచ దిగ్గజ నగరాలైన న్యూయార్క్, టోక్యో, సింగపూర్ లాంటి నగరాలతో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరగబోతుంది.
రెన్యువబుల్ ఎనర్జీతో, అల్ట్రా మోడర్న్ సిటీని ప్రభుత్వం డిజైన్ చేస్తుంది. రీజినల్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రైల్, డెడికేటెడ్ గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే, డెడికేటెడ్ రైల్వే కారిడార్, మెట్రో విస్తరణ, భవిష్యత్తులో 100 సంవత్సరాలు ఉండాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనగా కనిపిస్తోంది. తాగునీటి కనెక్టివిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చెందాలంటే, రోడ్డు కనెక్టివిటీ తోపాటు నీటి కనెక్టివిటీ, విద్యుత్ కనెక్టివిటీ ఉండాలి.
దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీలో తాగునీరు చాలా ముఖ్యమైన విషయం. అందుకే రింగ్ బండ్ కూడా కడుతున్నారు. గోదావరి నుంచి ఒకవేళ సమస్య వస్తే కృష్ణా నుంచి సప్లిమెంట్ చేయడానికి, కృష్ణా నుంచి సమస్య వస్తే గోదావరి నుంచి సప్లిమెంట్ చేయడానికి, అవుటర్ రింగ్ రోడ్ లాగ వాటర్ పైపులైను కూడా రింగ్‌గా కడుతున్నారు. ఎక్కడా నుంచి ఎక్కడికైనా తాగునీటి కనెక్టివిటీ ఉంటుంది. సింగూర్, మంజీరా, గోదావరి, కృష్ణా, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి తాగునీరు కనెక్టివిటీ నిర్మిస్తున్నారు.
గ్రామాల విలీనంతో మొదలు…
ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఒకే నగరమనే ప్రక్రియ అంచె లంచెలుగా జరుగుతోంది. సెప్టెంబరు 2, 2024లో ఆర్డినెన్స్ ద్వారా 51 గ్రామ పంచాయతీలను ప్రభుత్వం చుట్టు పక్కలు న్న పట్టణ స్థానిక సం(యూఎల్‌బీ)ల్లో విలీనం చేసింది. ఆయా 27 యూఎల్‌బీల పాలకమండళ్ల పదవీ కాలం జనవరి, 2025 లో పూర్తయింది. జీహెచ్‌ఎంసీ పాలకమండలి పదవీ కాలం ఫిబ్రవరి 11, 2026తో ముగియనుంది. ప్రస్తుత పాలకమండలి విలీనంపై ఎలాంటి అభిప్రాయం తెలిపినప్పటికీ తర్వాత జీహె చ్‌ఎంసీలో నియమితులయ్యే ప్రత్యేక కమిషనర్ శివారులోని 27 యూఎల్‌బీల విలీనాన్ని ఆమోదిస్తారు.
పెరిగిన జీహెచ్‌ఎంసీ విస్తీర్ణం…
హైదరాబాద్‌లో నిజాం నవాబుల పాలన నుంచి ఇప్పటి వరకూ అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న 20 మున్సిపాల్టీలు, 7 కార్పొరేషన్లు బల్దియా లో విలీనమయ్యే ప్రక్రియకు అడుగుపడడంతో జీహెచ్‌ఎంసీ విస్తీర్ణం మరింత పెరిగింది. 55 చ.కి.మీ విస్తీర్ణంతో మొదలైన ఈ మహానగరం అభివృద్ధి ప్రణాళిక నేడు 2 వేల చదరపు కిలోమీట ర్లకు విస్తరిస్తోందంటే ఏ స్థాయిలో విస్తీర్ణం ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఈ నిర్ణయం ఎందుకంటే…
ఓఆర్‌ఆర్ పరిధిలోని ప్రాంతాలన్నింటినీ టీ-సీయూఆర్ గా పేర్కొంటూ ఒకే గొడు కింద అభివృద్ధి చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. కానీ టీసీయూఆర్‌లో ప్రస్తుతం నాలుగు రకాల పాల న ఉంది. ఈ వ్యత్యాసాలను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై త్వరలోనే జీవో 570 ప్రకారం వార్డుల పునర్విభజన చేపడతామని ఎక్స్ అఫీషియో సభ్యులు, కార్పొ రేటర్ల ప్రశ్నలకు కమిషనర్ ఆర్వీ కర్ణన్ సమాధానం ఇచ్చారు.
అంచెలంచెలుగా…
నిజాం ప్రభుత్వం 1869లో పురపాలక వ్యవస్థను అమల్లోకి తెచ్చింది. అప్పట్లో హైదరాబాద్ జనాభా 3.5 లక్షలు దాని విస్తీర్ణం 55 చదరపు కిలోమీటర్లు ఉంది. 1933లో హైదరా బాద్ నగరపాలక సంస్థ (హెచ్‌ఎంసీ) ఏర్పాటు చేశారు. 1950లో సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటైంది. 1955లో హైదరాబాద్, సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ల ను ఒకటిగా చేసి హెచ్‌ఎంసీ చట్టం-1955ను అమల్లోకి తీసుకొచ్చారు.
2007లో రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని 12 మున్సిపాల్టీ లు, 8 గ్రామ పంచాయతీలను హెచ్‌ఎంసీలో విలీనం చేసి జీహెచ్‌ఎంసీని ఏర్పాటు చేశారు. 2019లో జీహెచ్ ఎంసీ పరిధిని ఆరు జోన్లు, 150 డివిజన్లుగా విభజించారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ విస్తీర్ణం 650చ.కి.మీ. ఉంది. ఇటీవల శివారులోని మున్సిపాల్టీలను విలీనం చేసే ప్రక్రియ మొదలైంది. దాంతో నగర విస్తీర్ణం 2 వేల చ.కి.మీలకు పెరుగుతుంది. ఆ మహా నగ రాన్ని మూడు నగరపాలక సంస్థలుగా విభజించాలని ప్రభు త్వం ప్రాథమికంగా నిర్ణయించింది. డివిజన్ల పునర్విభజన, సర్కిళ్లు, జోన్ల హద్దులపై మున్ముందు స్పష్టత వస్తుంది.
