Meeting | పరస్పరం సహకరించుకోవాలి

Meeting | పరస్పరం సహకరించుకోవాలి

ప్రాసిక్యూషన్ రాష్ట్ర డైరెక్టర్ సరళాదేవి
పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, పోలీసుల మధ్య కోఆర్డినేషన్‌పై రివ్యూ మీటింగ్

Meeting | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాల మేరకు పట్టణంలోని రామక్రిష్ణ పీజీ కళాశాల మీటింగ్ హాల్ నందు కర్నూలు, నంద్యాల జిల్లాల పబ్లిక్ ప్రాసిక్యూటర్స్- పోలీసు అదికారులతో శనివారం రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ సి. సరళాదేవి ఆధ్వ‌ర్యంలో నిర్వహించారు. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం క్రిమినల్ కేసులలో పోలీస్ మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ల మధ్య కోఆర్డినేషన్ ఎలా ఉండాలి అనే అంశంపై చర్చ జరిగిందన్నారు.

ఒక వ్యక్తి నేరం చేసినప్పుడు సదరు వ్యక్తిని అరెస్టు చేసే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, కోర్టులో హాజరుపరచుటకు ముందు పోలీస్ అధికారులు నిర్వహించవలసిన విధివిధానాల గురించి కోర్టు వారు వివరించడం జరిగిందన్నారు. దర్యాప్తు అధికారి నేరం చేసిన వారికి శిక్ష పడేలా చర్యలు తీసుకోవడంలో ముఖ్యపాత్ర పోషించాలని కేసుకు సంబంధించి అన్ని ఆధారాలను సేకరించి కోర్టుకు సమర్పించాలన్నారు.

డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సి. సరళాదేవి తోపాటు నంద్యాల ఏఎస్పీ ఎం.జావళి, డోన్ డీఎస్‌పీ శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాసులు, మహేశ్వరి , అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మోతీలాల్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లు సి.వి. శ్రీనివాసులు వై. శ్రీహరి,మూడవ ఏ డి జె అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నంద్యాల నాగ రాజశేఖర్ రెడ్డి , అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శివప్రసాదరావు ,కర్నూలు, నంద్యాల జిల్లాల పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ మరియు నంద్యాల జిల్లా పోలీసు అదికారులు పాల్గొన్నారు.

Leave a Reply