meeting | ప్రజాభిప్రాయ సేకరణ విజయవంతం చేయండి

meeting | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట – కొడంగల్ – మక్తల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో కేంద్ర పర్యావరణ అనుమతి చేపట్టే అభిప్రాయ సేకరణను నాయకులందరూ విజయవంతం చేయాలని ఊట్కూర్ తాసిల్దార్ చింత రవి, ఎంపీడీవో కిషోర్ కుమార్ అన్నారు. ఈ రోజు నారాయణపేట జిల్లా ఊట్కూర్ ఎంపీడీవో కార్యాలయంలో కలెక్టర్ ఆదేశాల మేరకు సర్పంచ్ లకు ఎత్తిపోతల పథకంపై చేపట్టే ప్రజా సేకరణ కార్యక్రమం పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… దామరగిద్ద మండల పరిధిలోని దామరగిద్ద తండాల్లో ఈనెల 8న కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు పొందేందుకు జీవో 69 పథకంలో భాగంగా ప్రాజెక్టు నిర్మాణం పనుల్లో చేపట్టే ప్రజాభిప్రాయ సేకరణలో సర్పంచులు పాల్గొని తమ అభిప్రాయాలు తెలపాలని అన్నారు.

ఊట్కూర్ మండలంలో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా 8 గ్రామాల్లో రైతులు భూములు కోల్పోతున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో సాగునీరు అందించేందుకు చేపట్టిన ప్రాజెక్టు కాలుష్య నియంత్రణ మండలి కేంద్ర పర్యావరణ అనుమతుల కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టినట్లుతెలిపారు. మండలం నుండి నాయకులు ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనే నాయకుల పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.

అనంతరం ఎస్సై రమేష్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని నూతన సర్పంచ్ లను కోరారు. అందుకు వల్లంపల్లి సర్పంచ్ కస్తూరివాణి వెంకట్రావు వెంకట్ రాములు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ నాటికి తమ గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం నూతనంగా గెలుపొందిన సర్పంచులను ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రమేష్, ఇన్చార్జి ఎం పి ఓ బాలాజీ, సూపర్డెంట్ కొండన్న, ఆయా గ్రామాల సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply