జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన జ్యేష్ఠ శ్రీనాథ్

జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన జ్యేష్ఠ శ్రీనాథ్

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిని మైలవరం మాజీ ఎమ్మెల్యే జ్యేష్ఠ రమేష్ బాబు తనయుడు, యువ నాయకుడు జ్యేష్ట శ్రీనాథ్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం. పార్టీ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని శ్రీనాథ్ తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం వైసీపీ చేపట్టిన పథకాలపై ఆయన ప్రశంసలు కురిపించారు. శ్రీనాథ్.. జగన్ ను కలవడం రాజకీయవర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది.

Leave a Reply