వాజేడు, జులై 11, ఆంధ్రప్రభ : ములుగు (Mulugu) జిల్లా వాజేడు మండల పరిధిలోని మలేరియా ప్రభావిత గ్రామాలైన అరుణాచలపురం (Arunachalapuram), మురుమూరు (Murumuru) తదితర గ్రామాల్లో వైద్య అధికారి మహేందర్ (Mahender) ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అక్కడి రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించగా, రెండు పాజిటివ్ కేసులు రావడంతో వారికి అవగాహన కల్పించి, మందులు అందించడంతో పాటు మనోధైర్యాన్ని కల్పించారు.
కొప్పుసూరు (Koppusuru), గణపురం (Ganapuram) గ్రామాల్లో వైరల్ ఫీవర్ ఉన్నందున దోమల మందు పిచికారి చేయడం జరిగింది. అదేవిధంగా జంగాలపల్లి గ్రామంలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించి రోగులను విజిట్ చేసి అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్ వైజర్ కోటిరెడ్డి, మురుమూరు పంచాయతీ కార్యదర్శి, కార్తీక్ హెల్త్ అసిస్టెంట్, శేఖర్, చిన్న వెంకటేష్, ఏఎన్ఎం సత్యనాగవేణి, ఆశా వర్కర్లు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.