ఆలేరులో వైద్య శిబిరం..

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని పోచమ్మగుడి వద్ద 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన వైద్య శిబిరాన్ని మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్ శనివారం ప్రారంభించారు. శారాజిపేట ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి హైమావతి, కౌన్సిలర్లు జెట్ట నీరజాసిద్ధులు, బొట్ల సంపత్, వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. శిబిరంలో వైద్యులు ప్రజలను పరీక్షించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.
