ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
చౌటుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారినీ స్పందన
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చౌటు పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ బి.స్పందన పేర్కొన్నారు.సోమవారం కమ్మర్ పల్లి మండలం హస కొత్తూరు గ్రామంలో సర్పంచ్ నలిమేల రేవతి గంగారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య నిపుణులచే ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారిణి డాక్టర్ స్పందన మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలన్నారు.
వైద్యుల ఆధ్వర్యంలో రోగులకు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. 76 మంది రోగులు రిజిస్ట్రేషన్ చేసుకోగా వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారికి కావలసిన మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఏనుగు మనోహర్, సెక్రెటరీ నవీన్, ఏఎన్ఏం లు సుజాత, మమత, ఆశా కార్యకర్తలు కల్పన, సుజాత, లావణ్య, చిటికేసి గంగాధర్ పడాల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
