Medical | ఉచిత మందులు వేయించాలి

Medical | ఉచిత మందులు వేయించాలి

Medical | రెంజల్, ఆంధ్రప్రభ : పెంపకందారులు మూగజీవాలకు మందులను తాగించాలని స్థానిక సర్పంచ్ లచ్చవార్ సుహాసిని నితిన్ అన్నారు. ఇవాళ‌ మండలంలోని సాటాపూర్ గ్రామంలో ఉచిత నట్టల నివారణ మందులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… గ్రామంలోని పెంపకందారులు జీవాలకు మందులు వేసే కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఏడాదికి మూడు, నాలుగు సార్లు పోస్తే బాగుంటుందని, గొర్రెల‌కు, మేకలకు ఎలాంటి వ్యాధులు రావని చెప్పారు. పశువైద్య, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో సాటాపూర్ గ్రామంలో గొర్రెల‌కు-1250, మేకలకు-480 మందులు తాగించినట్లు పశు వైద్యాధికారి డాక్టర్ విట్టల్ తెలిపారు. కార్యక్రమంలో జూనియర్ వెటర్నరీ అధికారులు నాగరత్నం, గంగరాజు, పెంపకందారులు హనుమాన్లు, దేవదాస్, శ్రీనివాస్, బలరాం, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply